ఎన్టీఆర్ ఈ సారైనా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా !

October 10, 2018 at 6:40 pm

నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ప్రతిబింభంలా ఉంటాడని టాక్ రావడంతో మనోడకి అలా కూడా మంచి అదృష్టం కలిసి వచ్చింది. స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి ఎన్టీఆర్ నటించి ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూస్తూ వచ్చాడు. టెంపర్ నుంచి జై లవకుశ వరకు వరుసగా విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ మొదటిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన మాటల మాంత్రికుడు ‘అరవింద సమేత’తో ఎన్టీఆర్ ని ఎలా ప్రజెంట్ చేస్తారా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఆంధ్ర, తెలంగాణ టాలీవుడ్ మార్కెట్ లో ఫస్ట్ డే షేర్ అన్నది పెద్ద హీరోలకు ఎంతె కీలకం. సినిమా విజయాపజయాలు ఎలా వున్నా, ఫస్ట్ డే రికార్డ్ అన్నది అభిమానులు కీలకంగా భావిస్తారు. ఈ మద్య ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఫస్ట్ డే టాప్ టెన్ లో ఎన్టీఆర్ కు జనతాగ్యారేజ్, జైలవకుశ వున్నాయి. అయితే టాప్ ఫైవ్ లో మాత్రం ఒక్కటీలేదు. టాప్ ఫైవ్ లో బాహుబలినే రెండు ఫ్లేస్ లు (22 కోట్లు..42 కోట్లకు పైగా) నిలిచింది. మూడో ప్లేస్ లో అజ్ఙాతవాసి, కాటమరాయుడు (27 కోట్లు, 23 కోట్లు) మిగిలిన ప్లేస్ మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ఆక్రమించింది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 5 ప్లేస్ లో రావాలంటే ఎంతలేదన్నా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్ 23 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది. దాదాపు 1500 కు పైగా స్క్రీన్లలో అరవింద సమేత విడుదలవుతోంది. అంతే కాదు ‘అరవింద’సమేత ఆంధ్ర, సీడెడ్ అంతా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ప్లాన్ చేసారు. తెల్లవారుఝామునే అన్నిచోట్లా షోలు పడిపోతున్నాయి. కేవలం నైజాంలో మాత్రమే రెగ్యులర్ షోలు వుంటాయి. ఈ లెక్కన ఫస్ట్ డే కలెక్షన్లు..పాతిక కోట్లకు పైగానే వసూళ్లు వుంటాయని అంచనా వేస్తోంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ డే బాహుబలి రికార్డు తరువాత అరవిందదే వుంటుందని గట్టిగా చెబుతున్నారు.

ఎన్టీఆర్ ఈ సారైనా ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share