సెంటిమెంట్ సుడిలో అరవింద సమేత !

October 10, 2018 at 2:35 pm

టాలీవుడ్ లో మొదటిసారిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వస్తుందని..ట్రైలర్ ని బట్టి చూస్తే అర్థం అవుతుంది. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ కూడా అదే యాసలో ఉంటాయట..అందుకోసం ఎన్టీఆర్ కూడా ఆ యాసలో మాట్లాడి ఆకట్టుకోబోతున్నాడట. అయితే మొదటి భాగం కాస్త ఎంట్రటైన్ మెంట్ గా నడిచినా..సెకండాఫ్ మొత్తం ఫ్యాక్షన్ తరహాలో ఉండబోతుందట.

అంతే కాదు ఫ్యాక్షనిజాన్ని ఎలా రూపుమాపాలి అన్న కోణంలో సినిమా ఉండబోతున్నట్లు వినికిడి. ఇదిలా ఉంటే..ఈ సినిమా రన్ టైమ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసినట్లు తెలుస్తుంది. అరవింద సమేత కూడా డ్యూరేషన్ పరంగా పెద్ద సినిమానే. సెన్సార్ సర్టిఫికేట్ లో దీని నిడివి 167 నిమిషాలుంది. ఒక 5 నిమిషాలు రాహుల్ ద్రవిడ్ యాడ్స్ తీసేసినా 162 నిమిషాలు పక్కా. అంటే సినిమా 2 గంటల 42 నిమిషాలన్నమాట.

ఈ మద్య కాలంలో వచ్చిన రంగస్థలం, అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, మహానటి లాంటి సినిమాలన్నీ కాస్త రన్ టైమ్ ఎక్కువ ఉన్న సినిమాలే అయినా..ఎక్కడా బోర్ కొట్టించే విధంగా లేకపోవడంతో సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు అరవింద కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. పైగా ఫలానా పోర్షన్ కట్ చేస్తే బాగుంటుందేమో, ఇక్కడ ఈ సీన్ ఎందుకు లాంటి సలహాలు కూడా త్రివిక్రమ్ వద్దకు రాలేదు.

అరవింద కూడా హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపిస్తోంది. పైగా ఫలానా పోర్షన్ కట్ చేస్తే బాగుంటుందేమో, ఇక్కడ ఈ సీన్ ఎందుకు లాంటి సలహాలు కూడా త్రివిక్రమ్ వద్దకు రాలేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ క్లయిమాక్స్ ఎంతో ప్లస్ పాయింట్ అయ్యింది..ఇప్పుడు అరవిందలో కూడా క్లయిమాక్స్ హైలెట్ గా నిలవబోతుందని చిత్ర యూనిట్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

సెంటిమెంట్ సుడిలో అరవింద సమేత !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share