కొత్త బిజినెస్ మొదలుపెట్టిన ఎన్టీఆర్

July 12, 2018 at 7:01 pm
What-If-Jr--NTR-Did-That-Scene--1525973134-1619 copy

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన చరిష్మా చూపిస్తూనే బుల్లితెరలోనూ సందడి చేస్తున్నాడు. ఇక వాణిజ్య ప్రకటనలలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నాడు. మహేష్ తర్వాత తెలుగు హీరోల్లో యాడ్స్ చేసే హీరో ఎన్.టి.ఆర్ మాత్రమే.  ఇప్పుడు ఎన్.టి.ఆర్ కూడా మరో మొబైల్ స్టోర్ కు బ్రాండింగ్ చేస్తున్నాడు. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్.టి.ఆర్ ఉండబోతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో చైన్ స్టోర్స్ తో సెలెక్ట్ మొబైల్ స్టోరెస్ రాబోతున్నాయి. ఇదిలా ఉంటే..ఇప్పుడు ఎన్టీఆర్ వ్యాపారం రంగం వైపు మొగ్గు చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.  

 

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు మంచి ఫామ్ లో ఉండగానే వ్యాపార రంగాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.  హైదరాబాద్ లో రకూల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కి సంబంధించిన జిమ్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కొంత మంది కుర్ర హీరోలు రెస్టారెంట్లు, మల్టిప్లెక్స్ వ్యాపారంలో తమ సత్తా చాటుతున్నారు.  యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తనకు సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఇటవలే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 

 

ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ – తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ లో ఇలా థియేటర్లు నిర్మించి ఈ వ్యాపార రంగంలో  దూసుకుపోతున్నారు బడా నిర్మాత సురేష్ బాబు.  ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి.  

 

ఇప్పుడు ఎన్టీఆర్ సైతం  భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యారు.  కాకపోతే.. కార్పొరేట్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించడానికి ఎన్టీఆర్ సన్నిహితులు  నిరాకరించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారని అంటున్నారు.  

కొత్త బిజినెస్ మొదలుపెట్టిన ఎన్టీఆర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share