అందరి మనసు గెల్చుకున్న ఎన్టీఆర్!

October 22, 2018 at 1:17 pm

ఈ మాట తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటారు..జూనియర్ ఎన్టీఆర్ ప్రతి విషయంలో నిబద్దత..క్రమశిక్షణతో పాటు ఎదుటి వారిని ఎంతో గౌరవించడం..ఆయన నైజం..అందుకే అగ్రనటుడి స్థాయికి వచ్చారని నిన్న జరిగిన ‘అరవింద సమేత’సక్సెస్ మీట్ లో పలువురు అన్న మాటలు. తన సమవుజ్జీలైన హీరోలతో సఖ్యంగా వుంటూ వారితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆ మద్య మహేష్ నటించిన ‘భరత్ అనే నేను’ అడియో ఫంక్షన్ కి హాజరయ్యాడు..ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నాడు.aravinda-sametha-movie-success-meet_154018148760

ఆ మద్య ఈ మహేష్, చరణ్, ఎన్టీఆర్ ఫోటోలతో సోషల్ మీడియా హల్ చల్ చేశాయి. ఇక అల్లు అర్జున్, ప్రభాస్, గోపిచంద్, మంచు మనోజ్ తో ఎంతో గొప్ప స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే కొంత కాలంగా ఎన్టీఆర్ కి ఒకే ఒక్క ప్రాబ్లామ్..తన బాబాయ్ బాలయ్య వర్గం. అయితే ఈ మద్య ఎన్టీఆర్ తండ్రి బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. దాంతో కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ దుఖఃసమయంలో నేనున్నానని భుజం తట్టి తన షూటింగ్ కార్యక్రమాలు పక్కన బెట్టి అన్ని తానే దగ్గరుండి చూసుకున్నాడు బాలకృష్ణ.

అంతే కాదు తన అన్న కుమారులను తాను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. గత కొంత కాలంగా రాజకీయ పరంగా వచ్చిన విబేధాల కారణంగా ఇంతకాలం బాబాయ్‌, అబ్బాయ్‌ మధ్య సఖ్యత లేదు. కానీ ఇప్పుడు ఇద్దరూ ఒక్కటైపోయారు. ఇప్పుడు ఆ సమస్యలే తమ మద్య లేవని నిరూపించారు..ఇద్దరూ ఒకే వేధికపై కలిశారు. దీంతో ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు శత్రుగణమే లేదు. ఇక తాను ఏ దర్శకుడితో సినిమా తీసినా..వారితో బంధుత్వం కలుపుకొని ఎంతో దగ్గరవుతాడని టాక్..అందుకే ఎన్టీఆర్ ఇండస్ట్రీలో అందరివాడిగా చూస్తుంటారు. అంతే కాదు తన అభిమానులకు కూడా ఎంతో చేరువగా ఉంటాడు ప్రతి నెల అభిమానులకి ఒక రోజు కేటాయించి వారితో కమ్యూనికేషన్‌ పెట్టుకుంటాడు.

అందరి మనసు గెల్చుకున్న ఎన్టీఆర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share