ఎన్టీఆర్ – చెర్రీ య‌మ‌ధీర కాదు… కొత్త టైటిల్ ఇదే…!

December 2, 2017 at 10:42 am
ntr-ramcharan-ss rajamouli-TJ

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ మూవీ గురించే న్యూస్ జోరుగా ట్రెండ్ అవుతోంది. బాహుబలి 2 సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ఏ సినిమా చేస్తాడు ? ఆ సినిమా స్టోరీ ఎలా ఉంటుంది ?  అందులో న‌టించే హీరో ఎవ‌రు ?  లాంటి అంశాలపై ఏ చిన్న న్యూస్ వ‌చ్చినా సంచ‌ల‌నంగానే మారుతోంది. ఈ సినిమా గురించి ఇప్ప‌టికే కొన్ని వార్త‌లు వ‌చ్చాయి. 

రాజ‌మౌళి తండ్రి, స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ అందిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌, చెర్రీ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తార‌ని, బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్‌, చెర్రీ ఇద్ద‌రూ బాక్సర్లుగా క‌నిపిస్తార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో సోష‌ల్ ఎలిమెంట్స్ బ‌లంగా ఉంటాయ‌ట‌. ఈ సినిమాకు య‌మ‌ధీర అన్న టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని నిన్న‌టి వ‌ర‌కు మీడియా, సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌పై మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు బాక్స‌ర్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. స్టోరీ బాక్సింగ్ నేప‌థ్యంలో ఉండ‌డంతో బాక్స‌ర్ అనే టైటిల్ అయితే యాప్ట్‌గా ఉంటుంద‌ని ఆ టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న న్యూస్‌. ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ డీవీవీ దాన‌య్య నిర్మించే ఈ సినిమా రూ.170 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్నట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ – చెర్రీ య‌మ‌ధీర కాదు… కొత్త టైటిల్ ఇదే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share