దుబాయ్‌లో ఎన్టీఆర్‌.. ఎందుకంటే..!

February 11, 2019 at 3:47 pm

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న మ‌ల్టీస్టార‌ర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్న ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లడం ఏమిట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఆయ‌న వెళ్లింది నిజ‌మే.. అందులోనూ కుటుంబంతో క‌లిసి వెళ్లాడు. అయితే.. ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్‌పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త లుక్ కోస‌మే ఎన్టీఆర్ వెళ్లాడ‌ని కొంద‌రంటే.. లేదులేదు.. ఫ్యామిలీ హాయిగా గ‌డిపేందుకే వెళ్లాడ‌ని మ‌రికొంద‌రు.. ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా అనేక ఊహాగానాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.rrr759

అయితే.. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్‌లో దొరికిన కొద్దిపాటి విరామాన్ని త‌న ఫ్యామిలీతో గ‌డిపేందుకే ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లాడ‌న్న‌ది మాత్ర‌మే నిజ‌మ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. రాజ‌మౌళి సినిమా అంటేనే విరామం లేకుండా జ‌రుగుతుంది. ఇలాంటి స‌మ‌యంలో దొరికిన విరామ స‌మ‌యాన్ని ఇలా స‌ద్వియోగం చేసుకోవ‌డానికి ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ వేశాడ‌ని తెలుస్తోంది.Drtj9a6VsAE1bqe

అదేవిధంగా.. ఈ విరామం త‌ర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రారంభం అయితే ఇక విరామం అనేది ఉండ‌ద‌ట‌. దీంతో వ‌చ్చే స‌మ్మ‌ర్ ట్రిప్‌కు ఏమాత్రం అవ‌కాశం ఉండ‌దు. అందుకే ఇప్పుడే ఇలా కుటుంబంతో గ‌డ‌పాల‌ని ఎన్టీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ లుక్ కు సంబంధించి ఎలాంటి మార్పులూ ఉండ‌వ‌ని స‌మాచారం.

దుబాయ్‌లో ఎన్టీఆర్‌.. ఎందుకంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share