ఐదుభాషల్లో ‘కేజీఎఫ్’ట్రైలర్!

November 9, 2018 at 4:10 pm

ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ లుక్, టీజర్ తోనే ఆ సినిమా రేంజ్ ఏంటో చెప్పేస్తున్నారు. అందుకు తగ్గట్టు గానే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్, టీజర్ , ట్రైలర్ లు ప్లాన్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కన్నడ హీరో యశ్ ప్రధానపాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). టాలీవుడ్‌లో రానున్న పీరియాడిక్ డ్రామా ఫిల్మ్ కెజీఎఫ్. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తికావడంతో శుక్రవారం రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో రానున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.kgf-1-759

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అన్ని బాషల్లో రిలీజ్ చేశారు. 1970 నాటి ఓ స్టోరీ ఆధారంగా రాబోతోంది. ‘వాడికి వెళ్లే దారి గురించి తెలీదు.. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలీదు, దానివెనుకున్న అమానుష చరిత్ర గురించి కూడా వాడికి తెలీదు’ అన్న డైలాగ్‌తో సినిమా ఒక సామాజిక యుద్దానికి చెందినదిగా కనిపిస్తుంది.

అమాయక ప్రజలను కాపాడటానికి ఒక నాయకుడిగా హీరో ఎన్నో కష్టాలకు ఒర్చుకొని ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తుంది. యాష్‌, శ్రీనిధిషెట్టీతోపాటు రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. తెలుగులో ఈ సినిమా కైకాల సత్యనారాయణ సమర్పణలో సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో విశాల్, హిందీలో ఫర్హాన్ అక్తర్‌లు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిసెంబర్ 21న దీన్ని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్.

ఐదుభాషల్లో ‘కేజీఎఫ్’ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share