క‌ళ్యాణ్‌రామ్ ‘ నా నువ్వే ‘ రేటు అదిరింది…

June 4, 2018 at 2:28 pm
naa nuvve -

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం కంప్లీట్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ జాన‌ర్‌లో చేస్తోన్న నా నువ్వే స్టిల్స్‌, లుక్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్యాణ్ రామ్ – మిల్కీబ్యూటీ త‌మ‌న్నా జంట‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు, మ‌ణిర‌త్నం శిష్యుడు జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే మంచి బ‌జ్ వ‌చ్చేసింది. ప్రేక్ష‌కులు ఈ సినిమా ప‌ట్ల ఆస‌క్తితో ఉన్నారు. దీంతో నా నువ్వే రైట్స్‌కు మంచి డిమాండ్ వ‌చ్చేసింది.

 

ఈ సినిమా యొక్క ఉత్తరాంధ్ర హక్కులను జిఎన్ ఫిలిమ్స్, ఏవిఆర్ ఫిలిమ్స్ కలిపి రూ.1.40 కోట్లకు కొనుగోలు చేశారు. ప‌టాస్ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో ఉన్న క‌ళ్యాణ్ సినిమాకు ఇది చాలా మంచి రేటే అని చెప్పాలి. అలాగే నా నువ్వే శాటిలైట్ రైట్స్, డిజిట‌ల్ రైట్స్‌కు కూడా మంచి ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

 

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రఫరా పిసి.శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ నెల 14న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

క‌ళ్యాణ్‌రామ్ ‘ నా నువ్వే ‘ రేటు అదిరింది…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share