కత్రినా కైఫ్ పరువు పాయే!

July 12, 2018 at 6:30 pm
Katrina Kaif-

టాలీవుడ్ లో  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగాత నటించిన ‘మల్లీశ్వరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.  ఈ సినిమాలో ఓ మహారాణిగా కత్రినా అందాలు చూసి అప్పట్లో కుర్రకారుకి పిచ్చెక్కి పోయింది.  ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.  అప్పట్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో అఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి.  

 

ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో చెట్టా పట్టాలేసుకొని బికినీతో తిరిగిన ఫోటోలు సంచలనం సృష్టించాయి.  తాజాగా దబాంగ్ టూర్ లో భాగంగా అమెరికాలోని వాంకోవర్ లో ఉంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది. అయితే ఆమె దురుసు ప్రవర్తన కారణంగా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కార్యక్రమ వేదిక వద్దకు చేరుకునే క్రమంలో సెల్ఫీల కోసం అభిమానులు చుట్టుముట్టారు.    

 

దాంతో ఒకరిద్దరిక సెల్ఫీ ఇచ్చినా..జనాలు ఎగబడ్డారు. దాంతో  ‘మీరిలా చేయకండి.. నేను అలసిపోయాను  అని తెలుసు కదా.. నేను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయంటూ ’ కత్రినా కాస్త గట్టిగానే అభిమానులను మందలించారు. కత్రినా వ్యాఖ్యలకు బాధపడిన ఓ మహిళ.. ‘పెద్ద హీరోయిన్ అని చెప్పుకుంటారు కదా.. అభిమానులు ముచ్చటపడి దగ్గరికి వస్తే  అలా కసురుకుంటారా.. మీ ప్రవర్తన మార్చుకోండి.. ’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించింది.  

 

 దాంతో కత్రినాకు చిర్రెత్తుకొచ్చింది..ఆమెతో గొడవకు దిగింది.‘మీకోసం ఎవరూ రాలేదు.. మేమంతా సల్మాన్ ఖాన్ కోసం వచ్చాం. కేవలం ఆయన కోసమే’ అంటూ కత్రినాకు ఎదురు తిరిగింది. ఇదంతా లైవ్ లో జరగడంతో కత్రినా పరువు పోయింది.

కత్రినా కైఫ్ పరువు పాయే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share