కీర్తి సురేశ్‌కి ల‌వ్ ప్ర‌పోజ్‌…

November 20, 2018 at 3:44 pm

చిత్ర‌సీమ‌లో హీరోయిన్ల‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యం అంద‌రిలో ఆస‌క్తిని రేకేత్తిస్తోంది. నటీమ‌ణుల‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యం.. అందులోనూ వ్య‌క్తిగ‌త విష‌యాలు తెలుసుకునేందుకు జ‌నం ఎంతో ఆస‌క్తిని చూపిస్తుంటారు. హీరోయిన్లపై వ‌చ్చే గాసిప్స్‌కి అంతే ఉండ‌దు. ఒక్కోసారి స్వ‌యంగా వాళ్లే కొన్ని కొన్ని విష‌యాలు చెప్పి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రుస్తారు. తాజాగా.. హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మొక‌టి ఓ షోలో అంద‌రితో పంచుకుంది. త‌న‌కు ఓ యువ‌కుడు చేసిన ల‌వ్ ప్ర‌పోజ్ గురించి చెప్పింది.Keerthi-Suresh-Hot-HD-Images-19

అయితే.. ఇది త‌న జీవితంలో ఊహించ‌ని ఘ‌ట‌న‌గా ఆమె చెప్పుకొచ్చింది. ఇంత‌కీ అదేమిటో చూద్దాం.. రానా హోస్ట్‌గా నిర్వహించిన ‘నం.1 యారీ’ ప్రోగ్రాం మంచి సక్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఇటీవల ఈ షో సీజన్ -2 కూడా ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఈ ఆదివారం జరిగిన షోకి నాని, కీర్తి సురేశ్‌ అతిథులుగా వచ్చి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కీర్తి సురేశ్‌ ఓ విషయాన్ని అంద‌రితో పంచుకుంది. తనకు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్‌ని ప్రేక్షకులతో పంచుకుంది.

ఆమె ఏం చెప్పిందంటే… “ఒకసారి నేను ఒక జ్యుయలరీ షాపు ఓపెనింగ్ కి వెళ్లాను. ఆ సమయంలో ఒక యువకుడు హఠాత్తుగా నా దగ్గరికి వచ్చి నాకు ఒక బుక్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. గిఫ్ట్‌గా బుక్ ఇచ్చి ఉంటాడని అనుకున్నాను. ఆ త‌ర్వాత‌ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో నావి కొన్ని ఫొటోలు వున్నాయి. వాటితో పాటు ఒక లవ్ లెటర్ కూడా వుంది. నన్ను ప్రేమిస్తున్నాననీ.. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు రాశాడు. అతని ఫోటోపై వివరాలు కూడా రాశాడు. అదే నా లైఫ్‌లో వచ్చిన ఫస్టు లవ్ లెటర్ .. కాలేజ్ రోజుల్లో మాత్రం ఎవరూ ఇవ్వలేదు“ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఈ షోని ఆ యువ‌కుడు చూశాడో లేదో మ‌రి.

కీర్తి సురేశ్‌కి ల‌వ్ ప్ర‌పోజ్‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share