TJ రివ్యూ: ఖాకి

November 17, 2017 at 2:41 pm
kaki -TJ

TJ రివ్యూ: ఖాకి

టైటిల్ : ఖాకీ

జానర్ : క్రైమ్ థ్రిల్లర్

న‌టీన‌టులు : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యూ సింగ్, బోస్ వెంకట్

సంగీతం : గిబ్రాన్

నిర్మాత : ప్రభు ఎస్ ఆర్, ప్రకాష్ బాబు ఎస్ ఆర్

దర్శకత్వం : హెచ్ వినోద్

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 161 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 17 న‌వంబ‌ర్‌, 2017

త‌మిళ్ వాడు అయినా హీరో కార్తీ తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. త‌న ప్ర‌తి సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్‌లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తూ మంచి స‌క్సెస్‌లు కొడుతున్నాడు. కాష్మోరా, ఊపిరి సినిమాల‌తో ఇక్క‌డ చ‌క్క‌టి స‌క్సెస్‌లు సొంతం చేసుకున్న కార్తీ త‌న తాజా సినిమాను ఇక్క‌డ ఖాకి పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాడు. కార్తీ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ఈ రోజు తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. మ‌రి ఖాకి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

ధీరజ్ హరి ప్రసాద్ (కార్తీ) పోలీస్ అధికారి. త‌న ఇంటి ఎదురుగా అద్దెకు వ‌చ్చిన ప్రియ (ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌)ను ల‌వ్ మ్యారేజ్ చేసుకుంటాడు. మ‌నోడు సిన్సియారిటీ కార‌ణంగా ఎక్కువుగా ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంటాడు. ఓ ప‌ల్లెటూరుకు వెళ్లిన కార్తీకి అక్క‌డ వ‌రుస‌గా జ‌రుగుతున్న హ‌త్య‌ల గురించి తెలుస్తుంది. ఫింగ‌ర్ ప్రింట్స్, ఒక చెప్పు, కిళ్లీ పేప‌రు ఆధారంగా ఓ టీమ్‌తో ప‌రిశోధ‌న ప్రారంభిస్తారు. హాజ్‌పుత్ వంశానికి చెందిన హ‌వేలీల ముఠా ఈ నేరానికి పాల్ప‌డింద‌ని తెలుసుకుంటారు. మ‌రి ఈ ముఠాను ధీర‌జ్ ప‌ట్టుకున్నాడా ?  లేదా ? ఈ ప్ర‌య‌త్నంలో అత‌డు ఏం చేశాడు ?  ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు ? ఈ ఇన్వెస్టిగేషన్ కారణంగా ధీరజ్ ఏం కోల్పోయాడు అన్నదే మిగతా కథ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ :

ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ఉన్న కార్తీ ఈ సినిమాతో యాక్ష‌న్ హీరోగా అవ‌తారం ఎత్తాడు. యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో కార్తీ న‌ట‌న క‌ట్టిప‌డేస్తుంది. ర‌కుల్ పాత్ర‌కు పెద్దగా ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో ఉన్నంత‌లోనే గ్లామ‌ర్ డోస్‌తో మెప్పించింది. హీరోకు ప్ర‌తి ఆప‌రేష‌న్‌లోను వెన్నంటి ఉండే పాత్ర‌లో స‌త్యగా బోస్ వెంక‌ట్ మెప్పించాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలోనూ డ్యూటీ చేసే సిన్సియర్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మెయిన్ విలన్ గా అభిమన్యూ సింగ్ తన మార్క్ చూపించాడు. కిరాతకంగా హత్యలు చేసే రాజస్థాన్  దొంగల ముఠా నాయకుడి పాత్రలో ఒదిగిపోయాడు. 

ఇక క‌థ‌నం విష‌యానికి వ‌స్తే 1995-2005లో త‌మిళ‌నాడులో జ‌రిగే దోపీడీ హ‌త్య‌ల‌ను. ఆ రాష్ట్ర పోలీసులు చాలా క‌ష్ట‌ప‌డి చేధించారు. అలాంటి నిజ ఘట‌న‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరెక్కించాడు ద‌ర్శ‌కుడు వినోద్‌. ఈ క‌థ‌ను త‌యారు చేసుకునేందుకే ద‌ర్శ‌కుడికి రెండేళ్లు ప‌ట్టింది. దీనిని బ‌ట్టి ఈ క‌థ‌ను రెడీ చేసుకునేందుకు ద‌ర్శ‌కుడు ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో ? అర్థ‌మ‌వుతోంది. తెర‌మీద సినిమా చూస్తున్నంత సేపు అస‌లు పోలీసులు ఇంత క్లిష్ట‌మైన కేసును ఎలా డీల్ చేశారా ? అని మ‌నం షాక్‌కు గుర‌వుతాం. ప్ర‌తిసీన్‌ను ద‌ర్శ‌కుడు చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేశాడు. 

సినిమాలో చిన్న‌చిన్న లోపాలూ ఉన్నాయి. పూర్తిగా క్రైం జానర్ లో సాగటం.. ఫ్యామిలీ ఆడియన్స్ కు యూత్ కు నచ్చే ఎమోషన్స్ లేకపోవటం కాస్త నిరాశ కలిగిస్తుంది. యాక్ష‌న్ మోడ్‌లో సినిమా స్టార్ట్ అయిన వెంట‌నే రొమాంటిక్ సీన్లు రావ‌డంతో సినిమా స్లోగా నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం అలాంటి సన్నివేశాలు లేకుండా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ లా సినిమాను తెరకెక్కించటం.. ఆసక్తికరమైన సన్నివేశాలు.. విలన్ వేసే ఎత్తులను హీరో చిత్తు చేయటం లాంటివి ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. ఇంట‌ర్వెల్‌కు ముందు పోలీసులు దొంగ‌ల‌ను ఛేజ్ చేసే స‌న్నివేశంతో పాటు..రాజ‌స్థాన్ నేర‌స్థుడిని ప‌ట్టుకునేట‌ప్పుడు బ‌స్‌లో జ‌రిగే యాక్ష‌న్ పార్ట్ కూడా మెప్పిస్తుంది. క్లైమాక్స్ విల‌న్స్‌ను హీరో అంత‌మొందించే సీన్స్ సూప‌ర్బ్‌.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– కార్తీ స‌హా ఇత‌ర న‌టీన‌టుల పెర్‌ఫార్మెన్స్‌

– క‌థ‌

– వినోద్ డైరెక్ష‌న్‌

– సినిమాటోగ్ర‌ఫీ & లోకేష‌న్స్‌

– ఆర్ ఆర్‌

– థ్రిల్లింగ్ సీన్లు

మైన‌స్ పాయింట్స్ (-):

– ర‌న్ టైం 161 నిమిషాలు ఉండ‌డం

– సినిమా ఎక్కువుగా సీరియ‌స్ మోడ్‌లో ఉండ‌డం

– ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు

 

TJ ఫైన‌ల్ పంచ్‌:  ఖాకి ప‌క్కా పోలీస్ మార్క్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌

TJ సూచ‌న‌: యాక్ష‌న్ ప్రియుల‌కు బిర్యానీ భోజ‌నం

TJ ఖాకి మూవీ రేటింగ్‌: 3 / 5

TJ రివ్యూ: ఖాకి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share