కొరటాలకు మిగిలింది ఆ ఒక్క హీరోనేనా ..!

April 26, 2018 at 12:39 pm
koratala siva-hero

నాలుగు వ‌రుస హిట్ల‌తో జోరు మీదున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న తాజా సినిమా భ‌ర‌త్ అనే నేను సినిమాతో మ‌రో మెట్టు ఎక్కాడు. ఇప్పుడు టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వ‌ర్గాలు, ఎన‌లిస్టులు రాజ‌మౌళి త‌ర్వాత ప్లేస్ కొర‌టాల‌కే క‌ట్ట‌బెట్టేస్తున్నారు. మిర్చితో కెరీర్ స్టార్ట్ చేసిన కొర‌టాల శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, భ‌ర‌త్ సినిమాల‌తో అన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లే త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

 

కొర‌టాల చేసిన సినిమాలు అన్ని ఆయా హీరోల‌కు కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్లు అయ్యాయి. ఇక బాహుబ‌లిని ప‌క్క‌న పెట్టేస్తే ప్ర‌భాస్‌కు మిర్చి కూడా బ్లాక్‌బ‌స్ట‌రే. ఇప్పుడు కొర‌టాల‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ టాప్ హీరోలు క్యూలో ఉండాల్సిన ప‌రిస్థితి. భ‌ర‌త్ స‌క్సెస్‌తో కొర‌టాల గ్రాఫ్ మామూలుగా పెర‌గ‌లేదు. ఇక ఇప్పుడు కొర‌టాల నెక్ట్స్ ఎవ‌రితో క‌మిట్ అవుతారు ? అన్న‌దే ప్ర‌శ్న‌గా మిగిలింది.

 

అయితే కొర‌టాల కెరీర్ స్టార్టింగ్ నుంచి స్టార్ హీరోల‌తోనే సినిమాలు చేస్తూనే వ‌స్తున్నాడు. ఇప్పుడు స్టార్ హీరోలు ఎవ్వ‌రూ ఖాళీగా లేరు. ఒక్క అల్లు అర్జున్ మిన‌హా మిగిలిన వారు త‌మ ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా ఉన్నారు. కొర‌టాల స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే విష‌యంలో రాజీప‌డ‌రు. ఇప్పుడు ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్‌తో, ప్ర‌భాస్ సాహోతో పాటు మ‌రో సినిమా, చెర్రీ బోయ‌పాటితో ఇలా అంద‌రూ బిజీబిజీగా ఉంటున్నారు. 

 

నా పేరు సూర్య కంప్లీట్ చేసుకున్న అల్లు అర్జున్ మాత్ర‌మే ఇప్పుడు ఏ డైరెక్ట‌ర్‌కు క‌మిట్ కాలేదు. ఇప్ప‌టికే కొర‌టాల కూడా అల్లు అర్జున్‌కు క‌థ చెప్పేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వీరిద్ద‌రి ప్రాజెక్టు త్వ‌ర‌లోనే ఎనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌.

కొరటాలకు మిగిలింది ఆ ఒక్క హీరోనేనా ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share