`మ‌హాన‌టి`లో అదే బ్లండ‌ర్‌.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు

May 12, 2018 at 1:24 pm
mahanati- savitri

సినిమా.. ఒక ఊహా ప్ర‌పంచం. ఇందులో అన్నీ క‌ల‌లా అనిపించే క‌థ‌లే కాదు.. క‌న్నీరు పెట్టించే నిజ జీవిత క‌థలు కూడా ఉంటాయి. అలాంటి వాటిని తెర‌పై హృద్యంగా చూపించ‌గ‌లిగే కళాకారులు ఉన్న‌ప్పుడే ఆ క‌థ‌ల‌కు సార్థ‌క‌త చేకూరుతుంది. అయితే ఎంత గొప్ప క‌థ అయినా అందులో కొన్ని పొర‌పాట్లు ఉండ‌టం స‌హ‌జ‌మే! మ‌హాన‌టుల జీవితాల‌ను నూటికి నూరు పాళ్లు అచ్చుగుద్దిన‌ట్టు తీయడం పూర్తిగా సాధ్యం కాక‌పోవ‌చ్చు. కొంత సినిమాటిక్ నేచ‌ర‌ను త‌ప్ప‌క వినియోగించాల్సి ఉంటుంది. కొంద‌రు వాటిని గ‌మనిస్తే.. మ‌రికొంద‌రు క‌థ‌లోనే లీన‌మై వీటి వంక అస‌లు చూడ‌నే చూడ‌రు. ప్రస్తుతం మ‌హాన‌టి సావిత్రి.. బ‌యోపిక్ విష‌యంలోనూ ఇలాంటి చిన్న పొర‌పాటే బ‌య‌టికి వ‌చ్చింది. 

 

`మ‌హాన‌టి`సినిమా అత్య‌ద్భుతంగా ఉంద‌ని, సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ జీవించింద‌నే ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సావిత్రి గారి జీవితాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు తెర‌పై ఆవిష్క‌రించిన తీరు అంద‌రి హృద‌యాల‌ను ద్ర‌వించేలా చేస్తోంది. మంచిత‌నం నిండిన చ‌ల్ల‌ని మ‌న‌సు ఆమె సొంతం. అందుకే నిజ జీవితంలో నటించే వారిని గమనించలేదు. ఆదే ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద పొర‌పాటు అంటారు ఆమెను ద‌గ్గ‌ర నుంచి చూసిన వారు. ఇక మహానటి సినిమా విషయానికి వస్తే.. సినిమా అందరి హృదయాలను చాలా గట్టిగా తాకింది. ఈ సినిమాలో ఒక పొరపాటు అందరిని షాక్ కి గురి చేసింది. అదేంటంటే.. మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు గారి పాత్రలో విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు కనిపించిన విష‌యం తెలిసిందే. సినిమాలో ఆయనకు సావిత్రి పాత్రకు సంబంధించిన ఒక సన్నివేశం పొరపాటు అని తేలింది. 

 

సావిత్రి కొంచెం డౌన్ అయ్యాక సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ జీవితాన్ని గడిపారు. `గోరింటాకు` సినిమా షూటింగ్ లో ఆమె అటు వైపుగా వెళుతుండగా ఎస్వీఆర్ పాత్ర(మోహన్ బాబు) ఆమెతో మాట్లాడతారు. ఆమెని ప్రొడక్షన్ టీమ్ పట్టించుకోకుండా ఉండడం.. కనీసం ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేయకపోవడం ఎస్వీఆర్ కి నచ్చదు. వెంటనే ప్రొడక్షన్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి తన లంచ్ ని తెప్పించి స్వయంగా ఆమెకు వడ్డిస్తారు. ఆ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

అదే స‌మ‌యంలో ముఖ్యంగా మోహన్ బాబు చెప్పిన డైలాగ్ అందరిని కదిలించింది. `అన్నం పెట్టే వాడి ఉంగరాళను కూడా కొట్టేయ్యాలని చూసే సమాజం అమ్మా ఇది` అంటూ చెప్పిన డైలాగ్ సావిత్రి ఓ జీవిత కోణాన్ని మనస్సులో ఇమిడిపోయేందుకు ఆ మాట కూడా సాయం చేసిందనే చెప్పాలి.

 

అందుకే చాలా మంది ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు. అసలు `గోరింటాకు` సినిమా చిత్రీకరణ సమయంలో ఎస్వీ రంగారావు గారు బ్రతికి లేరు. 1979లో ఆ సినిమాను చిత్రీకరించారు. 1974లోనే ఎస్వీఆర్ మ‌ర‌ణించారు. ఇదే అతిపెద్ద మిస్టేక్ అని అందరూ చెబుతున్నారు. ఈ విష‌యం దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిసే ఆ సీన్ షూట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చాడు. నిజంగా గోరింటాకు సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో గుమ్మడి గారు ఒక్కరే ఉన్నారు. కానీ ఆయన పాత్రను రెడీ చేసుకోలేదు. కేవీ రెడ్డి చక్రపాణి వంటి వారు కూడా ముందే మరణించారు. అందులో అప్పటికే సినిమాలో ఎస్టాబ్లిష్ చేసిన ఎస్వీఆర్ పాత్ర అయితే బెటర్ గా ఉంటుందని భావించి జీవితం తాలూకు భావాన్ని చెప్పడానికి అక్కడ అలా షూట్ చేశామని నాగ్ అశ్విన్ వివరించాడు.

`మ‌హాన‌టి`లో అదే బ్లండ‌ర్‌.. క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share