‘ మ‌హానుభావుడు ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే

September 29, 2017 at 3:59 am
mahanubhavudu1111

యంగ్‌హీరో శ‌ర్వానంద్ త‌న సినిమాల‌తో ప‌దే ప‌దే పెద్ద హీరోల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్లు కొడుతున్నాడు. గ‌త సంక్రాంతికి డిక్టేట‌ర్ – సోగ్గాడే చిన్ని నాయ‌నా – నాన్న‌కు ప్రేమ‌తో సినిమాల‌తో పోటీప‌డి ఎక్స్‌ప్రెస్ రాజాతో హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతికి చిరు ఖైదీ నెంబ‌ర్ 150 – బాల‌య్య శాత‌క‌ర్ణికి పోటీగా త‌న శ‌త‌మానం భ‌వ‌తిని రిలీజ్ చేసి మ‌ళ్లీ సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ యేడాది ఇప్ప‌టికే శ‌త‌మానం భ‌వ‌తి, రాధా సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శ‌ర్వా ఇప్పుడు ద‌స‌రాకు ముచ్చ‌ట‌గా మూడో సినిమా మ‌హానుభావుడుతో థియేట‌ర్ల‌లోకి దిగాడు.

ద‌స‌రాకు మ‌హేష్ స్పైడ‌ర్‌, ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌కు పోటీగా వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ల త‌ర్వాత సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం. సినిమాలో హీరో శ‌ర్వానంద్‌, హీరోయిన్ మెహ్రీన్ ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. మెహ్రీన్ అందానికి ఫిదా అయిన మ‌నోడు తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతాడు. ఫ‌స్టాఫ్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు, నాజ‌ర్ క్యారెక్ట‌ర్‌, చివ‌ర‌కు శర్వా అతి శుభ్ర‌త‌తో లేనిపోని క‌ష్టాలు రావ‌డంతో మెహ్రీన్ అత‌డి ప్రేమ‌కు గుడ్ బై చెపుతుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ గుడ్‌.

ఇక సెకండాఫ్‌లో హీరోకు – హీరోయిన్ ఫ్యామిలీకి మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్లు మారుతి బాగా ప్ర‌జెంట్ చేశాడు. సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్‌, కామెడీ చాలా ప్ల‌స్‌. సినిమా సూప‌ర్ ఫ‌స్టాఫ్‌, యావ‌రేజ్ సెకండాఫ్‌తో ఓవ‌రాల్‌గా హిట్ అనిపించుకుంది. సినిమాలో మ‌రీ అదిరిపోయే రేంజ్ కామెడీ లేక‌పోయినా ఓవ‌రాల్‌గా మాత్రం శ‌ర్వా ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్టే అని ప్రైమ‌రీ రిపోర్టులు చెపుతున్నాయి. సినిమాకు మంచి వ‌సూళ్లు కూడా ద‌క్కే ఛాన్సులు ఉన్నాయి. ఇక పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుజర్న‌లిస్టు.కామ్‌

‘ మ‌హానుభావుడు ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… రిజ‌ల్ట్ ఇదే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share