శ‌ర్వానంద్ ‘ మ‌హానుభావుడు ‘ టీజ‌ర్.. (వీడియో)

విక్ట‌రీ వెంక‌టేష్‌తో బాబు బంగారం సినిమా త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయిన యంగ్ డైరెక్ట‌ర్ మారుతి యంగ్ హీరో శ‌ర్వానంద్‌ను ఇంప్రెస్ చేసి ఓ సినిమా ప‌ట్టేశాడు. మ‌హానుభావుడు పేరుతో యూవీ క్రియేష‌న్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ యేడాది సంక్రాంతికి శ‌త‌మానం భ‌వతితో హిట్ కొట్టిన శ‌ర్వానంద్ స‌మ్మ‌ర్‌లో రాధా సినిమాతో నిరాశ‌ప‌రిచాడు. ఇప్పుడు ద‌స‌రాకు ముచ్చ‌ట‌గా మూడో సినిమా మ‌హానుభావుడుతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. 48 సెక్ష‌న్ల పాటు ఉన్న టీజ‌ర్‌లో అస‌లు క‌థేంటో చెప్పేశాడు మారుతి.

మ‌నోడు సినిమాలో అతిశుభ్ర‌వంతుడైన క్యారెక్ట‌ర్లో క‌నిపించ‌నున్నాడు. ఒక కంపెనీలో పని చేసే శర్వానంద్ అతి శుభ్రతను పాటిస్తూ ఉంటాడు. ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వచ్చినా బ్రష్ చేశావా అని అడుగుతాడు. ఇక హీరోయిన్ కాళ్ల‌ను త‌న కాళ్ల‌తో తాకాల‌న్నా ఆమె కాళ్ల‌కు స్ప్రే చేశాకే త‌న కాళ్ల‌ను ఆమె కాళ్ల‌కు అంటిస్తాడు.

టీజ‌ర్‌లో మారుతి హీరొయిన్ మెహ్రీన్ కౌర్‌ను ఎక్కువ హైలెట్ చేయ‌కుండా శ‌ర్వానంద్ మీదే ఎక్కువ ఫోక‌స్ చేశాడు. ఇక రాధా ప్లాప్‌తో ఉన్న శ‌ర్వాకు బాబు బంగారం త‌ర్వాత ప‌డిపోయిన మారుతికి ఈ సినిమా హిట్ అవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. ఇక టీజ‌ర్‌లో థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ నీట్‌గా ఉంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాక్ బోన్‌గా ఉండ‌డంతో ద‌స‌రాకు పెద్ద సినిమాల మ‌ధ్య‌లో పోటీగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.