‘ మ‌హానుభావుడు ‘ 2 డేస్ క‌లెక్ష‌న్స్… శ‌ర్వా కెరీర్ రికార్డ్‌

యంగ్ హీరో శ‌ర్వానంద్ – మారుతి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మహానుభావుడు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. పండ‌గ సీజ‌న్‌కు పెద్ద హీరోల సినిమాల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొడుతోన్న శ‌ర్వానంద్ ఈ యేడాది సంక్రాంతి శ‌త‌మానం భ‌వ‌తి సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్ కొట్టిన శ‌ర్వా ఇప్పుడు ద‌స‌రాకు మ‌హానుభావుడుతో మ‌రో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ లాంటి రెండు పెద్ద సినిమాల‌కు పోటీగా మ‌హానుభావుడు సినిమాతో వ‌చ్చి మ‌ళ్లీ సూప‌ర్ హిట్ కొట్టాడు. మ‌హానుభావుడు సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవ్వ‌డంతో మంచి ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మ‌హానుభావుడు తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.8 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల‌కు వ‌రల్డ్ వైడ్‌గా రూ.6.8 కోట్ల షేర్ మరియు రూ.13.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

ఈ సినిమాకు లభిస్తోన్న‌ స్పందనకి తోడు ఈ వారంలో కొత్త సినిమాలేవీ విడుదలకాకపోతుండటంతో కలెక్షన్లు ఇలాగే బలంగా కొనసాగనున్నాయి. శర్వానంద్ చిత్రం ఈ స్థాయిలో వసూళ్ళని రాబట్టడం ఇదే తొలిసారి. శర్వానంద్ సరసన ఈ చిత్రం ఓ మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. యూవీ క్రియేష‌న్స్ నిర్మించిన ఈ సినిమాకు థ‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చారు.