మ‌హేష్ ల‌వ‌ర్ సుడి తిరిగింది… అదిరిపోయే సూప‌ర్ ఆఫ‌ర్

April 23, 2018 at 10:36 am
kaira advani-mahesh

ఏ హీరొయిన్ కైనా టాలీవుడ్ డెబ్యు మూవీ బ్లాక్ బస్టర్ కావడం అవ్వ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. అలా జ‌రిగింది అంటే ఆమె చాలా  ల‌క్కీనే అనుకోవాలి. అయితే బాలీవుడ్ సినిమా ధోనీ ఫేం కైరా అద్వానీ సుడి మాత్రం తెలుగులో మామూలుగా లేదు అనుకోవాలి. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప‌క్క‌న ఆమె న‌టించిన తెలుగు డెబ్యూ సినిమా భ‌ర‌త్ అనే నేను భారీ రికార్డుల‌తో దూసుకుపోతోంది. భ‌ర‌త్ కేవ‌లం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డులు త‌న ఖాతాలో వేసుకుంటోంది.

 

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడే ఇదే నిర్మాత దాన‌య్య నిర్మిస్తోన్న చ‌ర‌ణ్ – బోయ‌పాటి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు. ఇక భ‌ర‌త్ అలా రిలీజ్ అయ్యి ఇలా హిట్ టాక్ తెచ్చుకుందో లేదో వెంట‌నే ఆమెకు మ‌రో అదిరిపోయే సూప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చేసింది. రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో నిర్మాత దాన‌య్య ఆమెను బుక్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ వార్త నిజ‌మైతే కైరా మామూలు ల‌క్కీ గ‌ర్ల్ కాద‌నే అనుకోవాలి.

 

భ‌ర‌త్ సినిమాలో కైరాకు స్క్రీన్ ప్రెజెన్సీ త‌క్కువే. అయితే అయితే ఆమె యాక్టింగ్‌తో పాటు క్యూట్ లుక్స్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక ఇప్పుడు ఆమె వ‌రుస‌గా మూడు సినిమాల‌ను దాన‌య్య బ్యాన‌ర్‌లోనే చేసినట్ల‌వ‌నుంది. ఏదేమైనా టాలీవుడ్‌లో కైరా ఎంట్రీ చాలా గ్రాండ్‌గానే జ‌రిగింది. ఇప్పుడు ఇక్క‌డ సీనియ‌ర్ హీరోయిన్లు వ‌రుస‌గా బోర్ కొట్టించేస్తున్నారు. 

 

అనుష్క‌, త‌మ‌న్నా, శృతి వీళ్ల‌ను జ‌నాలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక్క‌ పూజా హెగ్డే ఇలాగే ఆఫర్స్ మీద ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా రానున్న రోజుల్లో కైరా అద్వాని బెస్ట్ ఛాయస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. బాలీవుడ్‌లో పెద్ద‌గా ఆఫ‌ర్లు లేని ఆమెకు తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు రావడంతో ఫుల్ ఖుషీగా ఉంద‌ట‌. ఇక రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్‌లో ఆమె జోడీ ఎన్టీఆరా లేదా చ‌ర‌ణా అన్న‌ది చూడాలి.

మ‌హేష్ ల‌వ‌ర్ సుడి తిరిగింది… అదిరిపోయే సూప‌ర్ ఆఫ‌ర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share