‘ స్పైడ‌ర్ ‘  టాక్‌లో ఆ ఒక్క మాటే పెద్ద హైలెట్‌

September 19, 2017 at 8:26 am
SPyder, Mahesh Babu

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ స్పైడ‌ర్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వినిపిస్తోంది. స్పై జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయ‌ని, స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంద‌ని కూడా ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

ఇక సెన్సార్ టాక్ త‌ర్వాత సినిమా గురించి ఒక్క విష‌య‌మై ప‌దే ప‌దే హైలెట్ అవుతోంది. ఈ సినిమాలో యాక్ష‌న్ ఎలిమెంట్స్ మాత్రం అదిరిపోయాయ‌ట‌. తెలుగు ప్రేక్ష‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమాలోను చూడ‌ని విధంగా స్పైడ‌ర్ సినిమాలోని యాక్ష‌న్ సీన్లు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి

ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్ అయిన‌ పీటర్ హెయిన్స్ మాస్టర్ యాక్షన్ సన్నివేశాలని చాలా బాగా రూపొందించాడ‌ని మ‌హేషే స్వ‌యంగా ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌లో కూడా మెచ్చుకున్నాడు. మొత్తం 2.25 గంట‌ల ర‌న్ టైంలో యాక్ష‌న్ స‌న్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు క‌న్నార్ప‌కుండా చూసేలా ఈ యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించార‌ట‌.

 

 

‘ స్పైడ‌ర్ ‘  టాక్‌లో ఆ ఒక్క మాటే పెద్ద హైలెట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share