‘ స్పైడ‌ర్ ‘ టాక్ మార‌డం వెన‌క‌..!

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ అన‌గానే స్పైడ‌ర్ సినిమాపై ముందుగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే స్టిల్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు రిలీజ్ అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకు క్రేజ్ పెర‌గ‌డం సంగ‌తేంటో గాని డివైడ్ టాక్ న‌డుస్తోంది. మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌కి స్వ‌త‌హాగా రావ‌ల్సినంత హైప్ ఈ సినిమాకి లేద‌న్న‌ది వాస్త‌వం.

సినిమా బాగా లేట్ అవ్వ‌డం, రీ షూట్లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం, సినిమా క‌థ మాస్‌కు, ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుందా ? అన్న సందేహాల‌తో సినిమాకు హైప్ రాలేదు. అయితే గ‌త నాలుగు రోజుల నుంచీ ‘స్పైడ‌ర్‌’ గాలి మారిన‌ట్టు క‌నిపిస్తోంది. లాబ్ రిపోర్ట్‌, సెన్సార్ రిపోర్ట్‌, విజుల‌వ్ ఎఫెక్ట్స్ చేసిన కంపెనీ నుంచి వ‌చ్చిన రిపోర్ట్ టాక్ ప్ర‌కారం స్పైడ‌ర్ మ‌హేష్ ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఖాయ‌మంటున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు సినిమా బాగోలేదంటున్న వారు కూడా స్పైడ‌ర్ సెకండాఫ్ ఇర‌గ‌దీసేసింది అంటున్నారు. ఎస్‌.జె.సూర్య విల‌న్ రోల్ అత‌డిని మ‌రో మెట్టు ఎక్కించ‌డం ఖాయ‌మ‌ట‌. ఇక బుల్లితెర‌పై వీక్‌గా ఉన్నాయ‌ని టాక్ వ‌స్తోన్న వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాత్రం అదిరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక ఫైన‌ల్‌గా మ‌హేష్ ఎంట్రీ, ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌, సెకండాఫ్ ఈ సినిమాని నిల‌బెట్టాయ‌ని, ఈ ద‌స‌రాకి మ‌హేష్ బాక్సాఫీసుని ద‌డ‌ద‌డ‌లాడిస్తాడ‌ని చెప్పుకొంటున్నారు. సినిమా తెలుగు, త‌మిళ్‌, అర‌బిక్ భాష‌ల్లో కూడా రిలీజ్ అవుతుండ‌డంతో దిమ్మ‌తిరిగిపోయే వ‌సూళ్లు వ‌స్తాయంటున్నారు.