మ‌హేశ్ క‌థ‌తో బ‌న్నీ సినిమా..!

March 5, 2019 at 10:37 am

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంటుంది. క‌థాంశం ఎంపిక నుంచి దానిని తెర‌పై న‌డిపించే తీరువ‌ర‌కు అన్నీ ప్ర‌త్యేకంగానే ఉంటాయి. అందుకే ఆయ‌నతో సినిమా అంటే హీరోలు ఎగిరిగంతేస్తారు. అయితే.. తాజాగా.. సుకుమార్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ వైర‌ల్ అవుతోంది. ముందుగా హీరో మ‌హేశ్‌బాబుతో మైత్రీమూవీస్ నిర్మాణంలో ఓ సినిమా చేయాల‌ని సుకుమార్ అనుకున్నారు. క‌థ‌ను మ‌హేశ్‌కు వినిపించ‌గా ఆయ‌న క‌న్విన్స్ కాలేద‌ట‌.

శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌హేశ్‌బాబు దానిని ప‌క్కకు పెట్టేసిన‌ట్లు తెలిసింది. మ‌హేశ్‌ను ఒప్పించ‌డంలో సుకుమార్ విఫ‌లం అయ్యాడ‌నే టాక్ వినిపించింది. అయితే.. ఇక్క‌డ మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మ‌హేశ్‌కు వినిపించిన క‌థ‌తోనే హీరో అల్లు అర్జున్‌తో సినిమా తీసేందుకు సుకుమార్ రెడీ అవుతున్నాడు. ఆ క‌థ‌లో చిన్న‌చిన్న మార్పులు చేసి.. బ‌న్నీతో సినిమా తీయాల‌ని సుకుమార్ డిసైడ్ అయ్యాడు.

అయితే.. ఇందుకు బ‌న్నీ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు ఇండ‌స్ట్రీవ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ నేప‌థ్య బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుంద‌ట‌. ఇక ఇందులో బ‌న్నీ బందిపోటుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇందుకు బ‌న్నీ కూడా ఓకే చెప్ప‌డంతో క‌థ‌ను సెట్స్‌మీద‌కు తీసుకెళ్లే ప‌నిలో ఉన్నాడ‌ట సుకుమార్‌. ఇక ఇదే స‌మ‌యంలో హీరో మ‌హేశ్‌బాబు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మ‌హేశ్ క‌థ‌తో బ‌న్నీ సినిమా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share