కొత్త లుక్స్ తో చంపేస్తున్న మహేష్

October 22, 2018 at 6:24 pm

టాలీవుడ్ అందమైన హీరో ఎవరంటే వెంటనే చెబుతారు..ప్రిన్స్ మహేష్ అని. ఈ మాటలు హీరోయిన్లు మాత్రమే కాదు ఆయన సహనటులే అంటుంటారు..మహేష్ రూపంలో ఏదో ఛరిష్మా ఉంటుందని..ఇప్పటికీ ఆయన ఎంతో యంగ్ గా కనిపిస్తుంటారని..యంగ్ హీరోలే ఆయనను చూసి కుళ్లుకుంటారని కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సూపర్ హిట్ సినిమాలో నటించాడు మహేష్. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉన్నా..తనదైన నటనతో అభిమానులను అలరించాడు.Mahesh-Babu-New-Look-from-Maharshi-Movie-1540208459-1247 (1)

ప్రస్తుతం వంశి పైడి పల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు. ముగ్గురు అగ్ర నిర్మాతలు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందని వినికిడి. కాగా ఈ సినిమా ఈ మద్య అమెరికాలో కొన్ని ముఖ్యమైన షెడ్యూల్స్ మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా మహేష్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సూటు బూటులో గాగుల్స్ పెట్టి ఏదో పెద్ద కంపెనీకి సిఈఓలాగా లేదా మల్టీ మిలియనీర్ లాగ ప్రిన్స్ లుక్ మహేష్ ని చూస్తుంటే రెండు కళ్లు సరిపోవడం లేదు అని అంటున్నారు అభిమానులు.

అయితే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో మహేష్ చాలా రిచ్ గా కనిపిస్తాడట..అందుకోసమే ఈ స్టైల్ డిజైన్ చేశారట దర్శకులు వంశి పైడిపల్లి. కథ పరంగా చూస్తే..మిలినియర్ గా ఉన్న మహేష్ బాబు తన స్నేహితుడు నరేష్ కోసం ఒకానొక పరిస్థితి పళ్లటూరికి రావాల్సి వస్తుందట..ఇక అక్కడ నుంచి సినిమా ఎమెషన్స్, హై వోల్టేజ్తో పాటు మాస్ కు కావలసిన యాక్షన్ డ్రామా ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ సంగీతం మరో అద్భుతం సృష్టించబోతుందని చిత్ర యూనిట్ అంటున్నారు.

కొత్త లుక్స్ తో చంపేస్తున్న మహేష్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share