‘ స్పైడ‌ర్ ‘ ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్స్ వింటే షాక‌వ్వాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన `స్పైడ‌ర్‌` థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాడు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు- గ‌జినీ, క‌త్తి వంటి చిత్రాల‌తో స్టార్ ద‌ర్శ‌కుడిగా మారిన మురుగ‌దాస్‌.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా అన‌గానే ఎంతో క్యూరియాసిటీ. అంతేగాక మ‌హేశ్ చిత్రాల్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో ఈ సినిమా నిర్మించ‌డం.. త‌మిళంలో మ‌హేశ్ తొలి సినిమా కావ‌డంతో అంచ‌నాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. వీటిని అందుకోవ‌డంలో స్పైడ‌ర్ వెనుక‌బ‌డింద‌నే టాక్ వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నా.. భారీగా విడుద‌లైన సినిమా.. క‌లెక్ష‌న్లు రాబట్ట‌డంలోనూ స్సైడర్.. ఇదే పంథా కొన‌సాగిస్తోంది. తొలిరోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి కేవ‌లం రూ.15 కోట్ల షేర్ మాత్రమే రాబ‌ట్టింది. ఇక ఏపీ, తెలంగాణ‌లో రూ. 23.40 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ అంద‌ని రిపోర్ట్స్ ప్రకారం స్పైడర్ మొదటి రోజు 38 కోట్లు గ్రాస్‌ వ‌సూలు చేసింది.  ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 15.3 కోట్లు షేర్ వసూలు చేసిన స్పైడర్ మిగిలిన రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో 15 కోట్లకు పైగా లాగేశాడ‌ట‌. యు ఎస్ లో 10 లక్షల 5 వేల 630 డాలర్లతో సత్తా చాటిన మహేష్ ఆస్ట్రేలియా లో కూడా అదే రేంజ్ వసూళ్లు రాబడుతున్నాడు. ఈ రన్ ఇలాగే కొనసాగితే వచ్చే మంగళవారం సెలవులు ముగిసే లోపు ఈజీగా వంద కోట్లు దాటే అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతానికి టాక్, రివ్యూలు వేటిని పట్టించుకోకుండా తమకు రెండు ఛాయసులు మాత్రమే ఉండటంతో జనం మహేష్, జూనియర్ ఎన్టీఆర్ కు సమానంగా ఓటు వేస్తున్నారు. 

రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేని కాన్సెప్ట్ కావడంతో ప్రాధాన్యతను బట్టి సినిమాకు వెళ్తున్నారు.  రేపు వచ్చే శర్వానంద్ మహానుభావుడు ఇద్దరినీ బీట్ చేసేంత రేంజ్ లేదు కాని కంటెంట్ మరీ బాగుంటే సైలెంట్ కిల్లర్ లాగా కొంత ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. స్పైడర్ కలెక్షన్స్ పట్ల ఫాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ గా ఉన్నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు మాత్రం కొంత న‌ష్టం త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

ఏరియాల వారీగా స్పైడ‌ర్ తొలిరోజు క‌లెక్ష‌న్స్‌

నైజాం 3.60, తూర్పుగోదావ‌రి 2.31, గుంటూరు 2.02, ప‌శ్చిమ‌గోదావ‌రి 1.90, సీడెడ్ 1.80, వైజాగ్ 1.75, నెల్లూరు 1.03, కృష్ణా 0.89 టోట‌ల్ ఏపీ+తెలంగాణ‌లో రూ.15.30 కోట్లు రాబట్ట‌గా మొత్తం 23.4 కోట్ల గ్రాస్ వ‌చ్చింద‌ట‌.మొత్తానికి భారీ హైప్‌తో రిలీజైన సినిమా ఏపీ, తెలంగాణ‌లో ఇలా కేవ‌లం రూ.15 కోట్లే రాబ‌ట్ట‌డం కొంత నిరుత్సాహప‌రిచే అంశ‌మే!