ప్రియా వారియ‌ర్ క‌న్ను కొడితే… సినిమా బిజినెస్ ఎన్ని కోట్ల‌య్యిందో తెలుసా…

February 17, 2018 at 1:15 pm
cinema-malayalam-priya prakash

వారం రోజుల క్రితం వ‌ర‌కు మ‌ళ‌యాళ సినిమా ఒరు ఆధార్ ల‌వ్ సినిమా గురించి ఎవ్వ‌రికి తెలియ‌దు. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యిందో హీరో, హీరోయిన్లు ఎవ్వ‌రో అస‌లు సినిమాకు ప‌బ్లిసిటీయే లేదు. చివ‌ర‌కు మ‌ళ‌యాళంలోనూ సైతం ఈ సినిమా అనేది ఒక‌టి తెర‌కెక్కుతుంద‌న్న విష‌యం అక్క‌డ సినీప్రియుల‌కు సైతం తెలియ‌దు. అయితే ఇప్పుడు ఒరు ఆధార్ ల‌వ్ సినిమా గురించి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ సినిమా టీజ‌ర్‌లో హీరోయిన్ ప్రియా వారియ‌ర్ క‌న్ను కొట్ట‌డంతో పాటు ఆమె హావ‌భావాల‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న కుర్ర‌కారే కాదు మిడిల్ ఏజ్ వాళ్లు సైతం ప‌డిపోయారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఆమె క‌న్నుగీటిన తీరుకు ఫిదా అయిపోతున్నారు. ఆ వీడియోను షేర్ చేయ‌డంతో పాటు త‌మ వంతుగా ప్ర‌మోష‌న్ చేస్తున్నారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ ఇలా ఏ సినిమా ఇండ‌స్ట్రీలో అయినా ఇప్పుడు ఒరు ఆధార్ ల‌వ్‌తో పాటు ప్రియా వారియ‌ర్ గురించి ఒక్క‌టే చ‌ర్చ‌. 

ఇప్పుడు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ రావ‌డంతో ప్రియా వారియ‌ర్‌కు ఇత‌ర భాష‌ల్లోనూ హీరోయిన్‌గా ఛాన్సులు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లో కుర్ర హీరోలు ఆమెను త‌మ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మెద‌లెట్టేశారు. ఇక ఒరు ఆధార్ ల‌వ్‌కు విప‌రీత‌మైన రేంజ్‌లో బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. రూ.కోటి బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు టోట‌ల్‌గా రూ.10 కోట్ల వ‌ర‌కు ప్రి రిలీజ్ బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. వీటిల్లో కొన్ని ఏరియాల‌కు ఇప్ప‌టికే బిజినెస్ కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

తెలుగులో ఈ సినిమాను పంపిణీ చేసేందుకు ఓ ప్ర‌ముఖ నిర్మాత రూ.2 కోట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. హిందీ, త‌మిళ్‌లో సైతం అదే రేంజ్‌లో డిమాండ్ ఉంది. మ‌ళ‌యాళంలో ఏరియాల వారీగా ఒరు ఆధార్ ల‌వ్ సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూట‌ర్లు పోటీలు ప‌డుతున్నారు. విచిత్రం ఏంటంటే సినిమా పూర్తి కాకుండానే బిజినెస్ పూర్త‌య్యేలా ఉంది. 

ప్రియా వారియ‌ర్ క‌న్ను కొడితే… సినిమా బిజినెస్ ఎన్ని కోట్ల‌య్యిందో తెలుసా…
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share