TJ రివ్యూ : W/O రామ్‌

July 20, 2018 at 11:12 am
ram- review

TJ రివ్యూ : W/O రామ్‌

నటి నటీమణులు : మంచు లక్ష్మి , సామ్రాట్ ,శ్రీకాంత్ , ఆదర్శ్ బాలకృష్ణ మరియు తదితరులు
నిర్మాణ సంస్ధ: మంచు ఎంటర్టైన్మెంట్
ప్రొడ్యూసర్ : వివేక్ కూచిభొట్ల
డైరెక్టర్ :విజయ్ ఏలకంటి
సంగీతం :రఘు దీక్షిత్
రచన : విజయ్ ఏలకంటి

 

తెలుగు హీరోయిన్ లలో ఒక విలక్షణ హీరోయిన్ గా మంచు లక్ష్మి కి మంచి పేరుంది. ప్లాపుల మీద ప్లాపులు ఎదురు అయిన టైం లో కూడా ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ తో సినిమా తీయాలి అని ఎదురు చూసిన వ్యక్తి ఆమె. మోహన్ బాబు కూతురు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తనకంటూ ఒక స్పెషల్ స్టైల్ ఏర్పరచుకుంది మంచు లక్ష్మి. స్టార్ వారసురాలి గా ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నటిగా కూడా ప్రత్యెక ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే విలక్షణ పాత్ర లో మెప్పించిన ఆమె తాజాగా వైఫ్ ఆఫ్ రాం సినిమాలో మరొక్కసారి తన అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమా ఎలా సాగిందో – ఈ క్రైం డ్రామా ఎలా ఉందొ చూద్దాం రండి. టీజర్ – ట్రైలర్ ల తో ఈ సినిమా మంచి ఆసక్తి రేకెత్తించింది . వైఫ్ ఆఫ్ రాం ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం రండి .. Manchu-Lakshmi-Wife-of-Ram-movie-1516002937-137-620x620

 

గాయం తో నెలల గర్భవతి అయిన దీక్ష – మంచు లక్ష్మి హాస్పిట లో ఉంటుంది. కళ్ళు తెరిచిన దీక్ష కి తన భర్త రాం చనిపోయాడు అనీ (సామ్రాట్) కడుపులో బిడ్డ చనిపోయింది అనే విషయం అర్ధం అవుతుంది. అప్పటి వరకూ యాక్సిడెంట్ అనుకున్న పోలీసులు కూడా రాం చావు మర్డర్ అనే కోణం లో  దర్యాప్తు మొదలు పెడతారు. ఫైనల్ గా ఒక హూడీ ( పెద్ద కోటు) వేసుకున్న వ్యక్తి ఆమె భర్తని పొడిచి లోయలో పడేసాడు అని తేలుతుంది. ఈ విషయం దీక్ష ద్వారానే తెలుసుకుంటారు వాళ్ళు కూడా.. ఎన్ని రోజులో గడిచినా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ముందుకు కదలకుండా ఉంటూ ఉండడం తో స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది దీక్ష. ఈ క్రమం లోనే రమణ అనే కానిస్టేబుల్ ఆమెకి సహాయం చేస్తాడు ( రమణ ప్రియ దర్శి) . ఇంతకీ ఈ మర్డర్ వెనకాల ఉన్నది రాఖీ అనే వ్యక్తి అని తెలుసుకుంటారు (ఆదర్శ్ – రాఖీ) .. కానీ ఆదర్శ్ అదే టైం లో దీక్ష ని కూడా చంపే ప్రయత్నం చేస్తాడు.  ఈ ప్రమాదాల నుంచి దీక్ష ఎలా తప్పించుకుంది..? రామ్‌ మరణానికి కారణం ఏంటి..? రాఖీని ఎలా అంతం చేసింది..? ఇవన్నీ సినిమా చూస్తే కానీ తెలీవు 1516106741984

 

పాజిటివ్ లు : 

మంచు లక్ష్మి ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒక వుమన్ షో లాగా ఈ సినిమా మొత్తం నడిపించారు ఆమె. కథ అంతా ఆమె చుట్టూ తిరగడం తో ఆమె పెర్ఫార్మెన్స్ దగ్గర నుంచీ డైలాగుల వరకూ బాగా క్యారీ చేసారు. కొన్ని సన్నివేశాల్లో ఆమె ఎమోషన్స్‌ ను అండర్‌ ప్లే చేసిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు లాంటి సినిమాల ద్వారా ఫుల్ కామెడీ పాత్రలకి అలవాటు పడిన ప్రియ దర్శి ఈ సినిమాలో మాత్రం సీరియస్ పాత్ర చేసి ఆకట్టుకున్నాడు అందరినీ. ఆదర్శ్‌ విలన్‌ రోల్‌ లో పర్ఫెక్ట్ గా ఫిట్‌ అయ్యాడు. సామ్రాట్‌ది నటనకు పెద్దగా అవకాశం లేని అతిథి పాత్రే. కొన్ని సీన్ లు చాలా బాగా నడిచాయి .. స్క్రీన్ ప్లే ఇంటరెస్టింగ్ గా సాగింది. థ్రిల్లర్ స్టైల్ లో ఒక సెంటిమెంట్ కూడా వర్క్ అవుతూ సాగుతుంది ఈ చిత్రం. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. రఘు దీక్షిత్ మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. 

 

నెగెటివ్ లు : 

స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండడం , కథలో వేగం లేకపోవడం ఈ సినిమాకి చాలా పెద్ద నెగెటివ్ లు. నేపధ్య సంగీతం అద్భుతంగా ఉండగా దానికి తగ్గట్టు సీన్ లు లేవు అని అనిపిస్తుంది ఎవరికైనా . స్టోరీ చాలా చోట్ల పట్టు కోల్పోవడం కూడా ఇబ్బందికర పరిణామం. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎంత బాగున్నా ఆ తరవాత వచ్చే పాయింట్ లు, సీన్ లూ కనక్ట్ అయ్యేలా లేవు . సెకండ్ హాఫ్ విపరీతమైన బోర్ కొట్టేస్తుంది. 

 

ఓవర్ ఆల్ : 

ఓవర్ ఆల్ గా చూసుకుంటే మంచు లక్ష్మి నటన – కొత్త జేన్రీ అని వెళ్ళిన వాళ్లకి కచ్చితంగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం ఖాయం. డైరెక్టర్ సరైన చోట్ల కేర్ తీసుకోకుండా సినిమా మొత్తం క్లైమాక్స్ ట్విస్ట్ కోసమే నడపడం తో జనాలకి బోర్ కొట్టేస్తుంది. మంచు లక్ష్మి నటన , ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ , నేపధ్య సంగీతం , కొన్ని కొన్ని సీన్ లూ ఈ సినిమాకి పాజిటివ్ లు అయితే సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకపోవడం ఈ సినిమాకి అతిపెద్ద నెగెటివ్ పాయింట్. 

రేటింగ్ :1.75/5

TJ రివ్యూ : W/O రామ్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share