మ‌ను రివ్యూ…

September 7, 2018 at 1:28 pm

మ‌ను రివ్యూ..!

చిత్రం: మ‌ను
నటీనటులు: రాజా గౌతమ్‌, చాందినీ చౌదరి, జాన్‌ కోట్లే, అభిరామ్‌, మోహన్‌ భగత్‌
సంగీతం: నరేశ్‌ కుమారన్‌
ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌రెడ్డి
కూర్పు: ఫణీంద్ర నరిశెట్టి
నిర్మాణం: ది క్రౌడ్‌
దర్శకత్వం: ఫణీంద్ర నరిశెట్టి
సమర్పణ: నిర్వాణ సినిమాస్‌
విడుదల తేదీ: 07-09-2018

కొంత కాలంగా టాలీవుడ్‌లో చిన్న సినిమాలు టాప్ లేపుతున్నాయి. అనూహ్య విజ‌యాల‌ను అందుకుంటున్నాయి. కొత్త‌త‌రం దుమ్మురేపుతోంది. క‌థలో, చిత్రీక‌ర‌ణ‌లోనూ మూస ధోర‌ణిని దూరంగా పారేసి.. నూత‌న‌త్వంతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందుకే కాబోలు వాటికి ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ ప్ర‌భావంతో తెలుగులో సినిమా కొత్త‌రూపం దాల్చుతోంది. హీరోయిజం మాయ‌మై.. క‌థే హీరోగా అవ‌తార‌మెత్తుతోంది. ఇలా చిన్న‌సినిమాలే నేడు పెద్ద హీరోల మాన‌సును కూడా మార్చేశాయి. క‌థలో బ‌లం ఉంటే చాలు.. త‌మ హీరోయిజాన్ని ప‌క్క‌న‌బెట్టి.. ఎలాంటి పాత్ర‌లు చేయ‌డానికైనా ముందుకు వ‌స్తున్నారు. అయితే.. విష‌యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా.. ఇక సూటిగా విష‌యానికి వ‌ద్దాం.. ఇప్ప‌టిదాకా మ‌నం చెప్పుకున్న‌ట్లుగా కొత త‌ర‌హా ఆలోచ‌న‌ల‌తో వ‌చ్చిన సినిమానే మ‌ను.0000

అయితే.. ఇక్క‌డ కొత్త‌గా ఉండాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డంలో ఎలాంటి పొర‌పాటు లేదు. అది నిత్యం చేయాల్సిందే. కానీ.. ఏం చేస్తున్నాం.. ఏం చెప్ప‌బోతున్నాం.. అన్న దానిపై మాత్రం గ్ర‌హ‌పాటు ఉండాల్సి. కొత్త‌గా చెబుతున్నామ‌న్న ఫీలింగ్‌తో బొత్తిగా అర్థం కాకుండా తీస్తే ఇక అంతే సంగ‌తులు. చ‌ద‌విన విన్నా జ‌నుల‌కంద‌రికి చ‌క్క‌గ తెలిస్తే రాత‌.. మెద‌డు చించుకుని నిఘంటుల‌న్నీ వెతికించిందే రోత‌..! అంటాడు ఓ క‌వి. రెండు గంట‌ల నిడివి ఉండే సినిమాకు అవ‌స‌రానికి మించిన‌ భావుక‌త జోడిస్తే.. చివ‌ర‌కి అది ఆవుక‌థ‌లా త‌యార‌వుతుంది. ఇప్పుడు మ‌ను సినిమా కూడా ప్రేక్ష‌కుల మ‌నోఫ‌ల‌కాన్ని క‌న్‌ఫ్యూజ‌న్ల‌కు గురి చేసింది. పాత్ర‌లు ప‌లికే భావాల్లోని లోతు తెలియ‌క ప్రేక్ష‌కులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యే ప్ర‌మాదం ఉంది. మ‌ను సినిమాపై కూడా ఇదే ఫీలింగ్ క‌లుగుతోంది వారిలో.

కథేమిటంటే… ఓ వ‌జ్రాల వ్యాపారి. అత‌ని ద‌గ్గ‌ర న‌మ్మ‌కంగా ప‌నిచేసిన ఉద్యోగికి ఓ విలువైన ఉంగ‌రం బ‌హుమ‌తిగా ఇస్తాడు. దానిపై అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోనీ అనే ముగ్గురి క‌న్ను ప‌డుతుంది. ఆ వ‌జ్రం కోసం వాళ్లు ఏం చేశారు.. ఈ క్ర‌మంలో ప్రేమ జంటకు ఎదురైన అనుకోట ఘ‌ట‌న‌లు ఏమిటి..? ఆ ప్రేమికులు ఎవ‌రు? వీళ్ల‌చుట్టూ తిరిగిందే `మ‌ను` క‌థ‌. వీళ్లంద‌రి మ‌ధ్య ఎలాంటి క‌థ న‌డిచింది? అనేదే `మ‌ను` క‌థ‌. అయితే మ‌నుగా రాజా గౌతమ్ న‌టించారు. ఈ సినిమాలో ఆయ‌న‌ ఓ చిత్రకారుడు. ఏదో విషయంలో తనలో తానే ఏదో ఆలోచిస్తుంటాడు. నీల (చాందినీ చౌదరి) మనుని ఇష్టపడుతుంది. ఈక్ర‌మంలో అనుకోని పొరపాటు వల్ల మనుని అపార్థం చేసుకుంటుంది. దాన్ని తెలుసుకుని మనుకి దగ్గరయ్యే క్రమంలో ఆమె జీవితంలో అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. వీట‌న్నింట‌నీ తెర‌పై చూడాల్సిందే.

ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు కీల‌క స‌మ‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డ‌మే పెద్ద మైన‌స్ గా క‌నిపిస్తోంది. వ‌జ్రం.. దాని కోసం అఘాయిత్యం.. ఇందులో ప్రేమ‌జంట‌.. మొత్తంగా హార‌ర్‌, థ్రిల్ల‌ర్ జోడించి మ‌ను సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. అయితే.. కీ రోల్ చిత్ర‌కారుడు కాబ‌ట్టి.. ఒక చిత్రం వేయి భావాల‌ను ప‌లికిస్తుంది.. అన్న న‌మ్మ‌కంతో అదే చిత్ర‌కారుడితో త‌క్కువ మాట‌ల్లో ఎక్కువ‌ భావాలు ప‌లికించాల‌న్న ఆత‌`త‌లో ద‌ర్శ‌కుడు అస‌లు ప్రేక్ష‌కుల‌ను మ‌రిచిపోయిన‌ట్లు క‌నిపిస్తోంది. పాత్ర‌చిత్రీక‌ర‌ణ‌లోనూ క్లారిటీ లోపించింది. ఇందులో దెయ్యం కూడా ఉంటుంది.. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుల్లో ఓ గంద‌ర‌గోళం నెల‌కొంటుంది. మొత్తంగా ప్రేక్ష‌కుడిని ద‌`ష్టిలో పెట్టుకోకుండా ద‌ర్శ‌కుడు ప‌ని చేశాడ‌ని చెప్పొచ్చు.

ఇక‌.. రాజా గౌతమ్‌ చాలా కాలం తర్వాత చేసిన సినిమా ఇది. ఈ పాత్ర కోసం మూడేళ్లు కష్టపడినట్లు రాజాగౌత‌మ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. సినిమా చూస్తే మాత్రం దీనికోసం ఇంత క‌ష్ట‌ప‌డాలా..? అనే అనుమానం క‌లుగుతుంది. అయితే… ప‌లు స‌న్నివేశాల్లో మాత్రం అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర్చాడ‌ని చెప్పొచ్చు. ఇక‌ చాందిని కూడా ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. న‌టులు మాత్రం ద‌ర్శ‌కుడు ఏం కోరుకున్నాడో అది ఇచ్చారు.. గానీ.. ప్రేక్ష‌కులు కోరుకున్న‌ది మాత్రం ద‌ర్శ‌కుడు ఇవ్వ‌లేక‌పోయాడు. ఇక అతి త‌క్కువ‌ బడ్జెట్‌లో తీసిన సినిమా తీసినా.. ఎక్క‌డ కూడా ప్రేక్ష‌కుడికి ఆ డౌట్ రాకుండా మెయింటెన్ చేశారు.

చివ‌రికి: ప్రేక్ష‌కుడి మ‌నుసు తెలుసుకోని మ‌ను

రేటింగ్ :2/5

మ‌ను రివ్యూ…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share