చిరు తప్పుల్ని సరిచేస్తున్నచరణ్ ,బన్నీ

January 18, 2019 at 12:04 pm

మెగాస్టార్ చిరంజీవి చేసిన పొర‌పాట్ల‌ను, త‌ప్పుల‌ను కొడుకు రాంచ‌ర‌ణ్‌, బ‌న్నీ స‌రిదిద్దుతున్నారు. అవి మ‌రోసారి రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. చిరు ప్ర‌భావం త‌మ‌మీద ప‌డుకుండా ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అదేమిటీ.. చిరు చేసిన పొర‌పాట్ల‌ను రాంచ‌ర‌ణ్‌, బ‌న్నీ స‌రిదిద్ద‌డం ఏమిట‌ని ఆలోచిస్తున్నారా..? ఇది నిజ‌మే. అదేమిటో తెలుసుకోవాల‌నుకుంటే ఈ చిన్న‌పాటి క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి.

చిరంజీవి.. వెండితెర‌పై తిరుగులేని హీరో.. తెలుగు ప్ర‌జ‌ల్లో ఆయ‌న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. బ్ల‌డ్ బ్యాంక్ నెల‌కొల్పి ఎంద‌రినో ఆప‌ద‌లో ఆదుకున్నారు. కానీ..ఏం లాభం.. ప్ర‌జారాజ్యాం పార్టీని ఏర్పాటు చేసి.. జ‌నంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఓ విష‌యంలో ఆయ‌న తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొన్నారు. అదేమిటంటే.. ఆయ‌న త‌న సొంత ఊరి మొగ‌ల్లూరుకు ఏమీ చేయ‌లేద‌నే టాక్ బ‌లంగా వ‌చ్చింది. మీడియా కూడా దీనినే బాగా హైలెట్ చేసింది. దీంతో సొంతూరికే ఏమీ చేయ‌లేని చిరు.. ఇక ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తాడ‌నే విమ‌ర్శ‌లు వెల్లువ‌లా వ‌చ్చిప‌డ్డాయి.

ఒక్క‌సారి రాజ‌కీయాల్లోకి అడుగుపెడితే ప్ర‌త్య‌ర్థులు ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోరు. చివ‌ర‌కు అది చిరును కోలుకోలేని దెబ్బ‌తీసింది. చిరు అత్తవారి ఊరు అయిన పాలకొల్లులోనే ఆయ‌న ఓడిపోయారు. ఇలాంటి పొర‌పాట్లు త‌మ‌దాకా రాకుండా రాంచ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ జ‌నంలో గుర్తుండిపోయే ప‌నులు చేస్తున్నారు. రాంచ‌ర‌ణ్ ఓ గ్రామాన్నిద‌త్త‌త తీసుకున్నాడు. బ‌న్నీ కూడా తాత‌గారి ఊరు పాల‌కొల్లులో క‌ళ్యాణ మండ‌పం క‌ట్టిస్తున్నాడు. అంతేగాకుండా మ‌రిన్ని సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాడు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌నంలోకి వ‌చ్చిన త‌ర్వాత వీరు ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

చిరు తప్పుల్ని సరిచేస్తున్నచరణ్ ,బన్నీ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share