త‌మ‌న్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్‌

September 22, 2017 at 7:22 am
Jai Lava Kusa, Thamanna, Item Song

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఎన్టీఆర్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే అదిరిపోయే రెస్పాన్స్ రావాలి. అది ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసేదిగా ఉండాలి. ఇది గ‌తంలో చాలాసార్లు కూడా రుజువు అయ్యింది. గ‌తేడాది వ‌రుస ప్లాపుల‌తో అంద‌రూ మ‌ర్చిపోయిన కాజ‌ల్ ద‌శ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా తిరిగిపోయింది.

నేను ప‌క్కా లోక‌ల్ అంటూ ఆమె వేసిన స్టెప్పుల‌తో ఆమెకు ఏకంగా చిరు సినిమాలోనే ఛాన్స్ వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆమె వ‌రుస హిట్లు కొడుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా జై ల‌వ‌కుశ సినిమాలో స్వింగ్ జ‌రా అంటూ త‌మ‌న్నా ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్‌లో త‌మ‌న్నా ఎంతో క‌ష్ట‌ప‌డి న‌డుంతో పాటు మిగిలిన పార్ట్స్ బాగా ఊపేసింది. హాట్ హాట్‌గా త‌న అంద‌చందాలు ఆర‌బోసేసింది.

ఆమె ఎంత ఊపుడు ఊపినా ఆమె సాంగ్ గురించి క‌నీసం మాస్ ప్రేక్షకులు కూడ పట్టించుకోకపోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబ‌లి సినిమా త‌ర్వాత కూడా ద‌శ మార‌క‌పోవ‌డంతో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసి ద‌శ మార్చుకోవాల‌నుకున్న త‌మ‌న్నా ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. అయితే ఈ సాంగ్‌లో త‌మ‌న్నా గ్లామ‌ర్ షో కాకుండా కేవలం పిచ్చి పిచ్చిగా ఊగిపోయేలా డ్యాన్సులతో షాకిచ్చింది.

ఈ సాంగ్ సినిమాకు పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఆమెకు యూజ్ లేద‌న్న టాకే ఎక్కువుగా న‌డుస్తోంది. సాంగ్‌లో ఆమె మూమెంట్స్ కూడా ఎక్కువ మందిని న‌చ్చ‌డం లేదు. ఇక కాజ‌ల్‌కు ‘నేను పక్కా లోకల్’ పాట పోగొట్టుకున్న ఇమేజ్ ని ఆమెకు మళ్ళీ తెచ్చిపెడితే తమన్నాకు ఈ ఐటమ్ సాంగ్‌తో ప్ల‌స్ కంటే మైన‌స్సే ఎక్కువ అయ్యింద‌న్న సెటైర్లు ప‌డుతున్నాయ్‌..!

 

త‌మ‌న్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share