‘నా నువ్వే’భారీ డిసాస్టర్..కలెక్షన్లు చూస్తే షాక్!

June 19, 2018 at 8:22 pm
naa nuvve collections-

కొన్ని సినిమాలు విడుదలకు ముందు మంచి ప్రచారాన్ని సొంతం చేసుకుంటాయి. టీజర్, ట్రైలర్, ఆడియోను బట్టి ప్రేక్షకులు సినిమాపై ఒక అంచనాకు వచ్చేస్తారు. దీనికి తోడు సినిమా కాస్త భిన్నంగా అనిపిస్తోందంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ‘నా నువ్వే’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. 

 

ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ కళ్యాణ్ అన్నకు ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి అన్నారు. కానీ సినిమా కాస్త బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఎప్పుడూ యాక్షన్ హీరోగా ఉండే కళ్యాన్ రామ్ మొదటి సారిగా లవర్ బాయ్ గా కనిపించాడు.  ఇక తమన్నా కూడా గ్లామర్ తో హాట్ గానే కనిపించింది.  

 

కానీ బ్యాడ్ లక్ ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇదిలా ఉంచితే, రిలీజ్‌కు ముందు మంచి ప్రచారం పొందిన సినిమా తొలి రోజు కనీసం కోటి రూపాయలు కూడా వసూలు చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.  ‘నా నువ్వే’ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.89 లక్షలు మాత్రమే వసూలు చేసింది.  ఇక రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో నా నువ్వే చిత్రానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. 

 

మిగతా వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. దీని ఎఫెక్ట్ ఈ చిత్ర కలెక్షన్లపై పూర్తిగా పడింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి కేవలం రూ. 1 కోటి పైచిలుకు మాత్రమే కలెక్ట్ చేసి మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ దిశగా సాగుతోంది.

 

ఏరియా  – షేర్ కలెక్షన్లు (కోట్లలో)

 

నైజాం –  0.17  

 

సీడెడ్ – 0.15  

 

ఉత్తరాంధ్ర – 0.13  

 

గుంటూరు – 0.09  

 

ఈస్ట్ – 0.09  

 

వెస్ట్ – 0.06 

 

కృష్ణా – 0.08 

 

నెల్లూరు  – 0.04  

———————————–

ఏపి+తెలంగాణ  = 0.81 కోట్లు

———————————–

ఓవర్సీస్ – 0.19 

 

రెస్టాఫ్ ఇండియా – 0.05 

——————————————

టోటల్ వరల్డ్ వైడ్ = 1.05 కోట్లు

——————————————-

‘నా నువ్వే’భారీ డిసాస్టర్..కలెక్షన్లు చూస్తే షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share