వ‌ర్మ – నాగ్ ఆఫీస‌ర్‌కు కోర్టు స్టే

May 17, 2018 at 1:07 pm
varma-nag

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ – నాగార్జున కాంబినేష‌న్‌లో రెండున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా అంటే అంచ‌నాలు ఎలా ఉండాలి…అదిరిపోవాలి. కానీ ఆఫీస‌ర్ సినిమాకు ఇప్ప‌టికే రెండు టీజర్లు, ఓ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక కూడా  ఏమాత్రం బ‌జ్ లేదు. ఇంకా చెప్పాలంటే రెండు టీజ‌ర్ల‌లో ముక్క‌లు క‌లిపేసి మ‌రొకొన్ని షార్టు క‌లిపేసి ట్రైల‌ర్ రిలీజ్ చేసేశారు.

 

రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినా బిజినెస్ బ‌జ్ లేదు. ముందుగా ఈ నెల 25 రిలీజ్ అన్నారు. త‌ర్వాత వ‌ర్మ అధికారికంగా సినిమాను జూన్ 1కు వాయిదా వేస్తున్న‌ట్టు చెప్పారు. తాజాగా ఆఫీస‌ర్‌కు కొత్త చిక్కులు వ‌చ్చాయి. ఈ సినిమా వాయిదా ప‌డ‌డానికి, చిక్కుల్లో చిక్కుకోవ‌డానికి వ‌ర్మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. 

 

వైటీ ఎంటర్ టైన్స్ మెంట్స్‌కు వ‌ర్మ‌కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయ‌ట‌. ఈ కేసులో వ‌ర్మ కోర్టుకు హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బాంబే హైకోర్టు వ‌ర్మ‌పై సీరియ‌స్ అవ్వ‌డంతో పాటు ఆఫీస‌ర్ విడుద‌ల‌పై స్టే ఇచ్చిన‌ట్టు స‌మాచారం. కోర్టు ఆదేశాల‌నే భేఖాతార్ చేసిన వ‌ర్మ‌పై కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

 

అయితే వ‌ర్మ మాత్రం త‌న ట్వీట్ట‌ర్‌లో సాంకేతిక కార‌ణాల వ‌ల్లే ఆఫీస‌ర్‌ను ఈ నెల 25 నుంచి జూన్ 1కు వాయిదా వేసిన‌ట్టు చెప్పారు. దీనికి తోడు సినిమాకు ఎలాగూ బ‌జ్ లేదు. మ‌రో వైపు ముందుగా అనుకున్న‌ట్టు 25న వేసేస్తే అదే రోజు ర‌వితేజ నేల టిక్కెట్‌, క‌ళ్యాణ్‌రామ్ నా నువ్వే ఉన్నాయి. వీటికి బ‌జ్ ఉంది. వీటి దెబ్బ‌తో ఆఫీస‌ర్‌కు ఓపెనింగ్స్ కూడా వ‌చ్చే ఛాన్సులు లేవు. 

 

ఆఫీస‌ర్ డిజిట‌ల్ రైట్స్ విష‌యంలో కూడా వ‌ర్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడ‌ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అస‌లే బ‌జ్ లేకుండా, బిజినెస్ లేకుండా క‌ష్టాల్లో ఉన్న ఆఫీస‌ర్‌కు ఇప్పుడు కోర్టు స్టే రూపంలో మ‌రో దెబ్బ‌ప‌డింది.

వ‌ర్మ – నాగ్ ఆఫీస‌ర్‌కు కోర్టు స్టే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share