నందమూరి అండ ఉన్న లేవలేకపోతున్నాడే ..!

October 23, 2018 at 6:23 pm
2222

యువ హీరో నారా రోహిత్ పరిస్థితి టాలీవుడ్ లో మిగిలిన హీరోలతో పోలిస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఇటు బలమైన సినిమా నేపథ్యంతో పాటు అటు రాజకీయ నేపథ్యం కలగలిసిన హీరో నారా రోహిత్.ఇదే బ్యాగ్రౌండ్‌తో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి తారకరత్నతో పోలిస్తే నారా రోహిత్ చాలా మెరుగైన హీరోనే అని చెప్పుకోవాలి.ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన తారకరత్న హిట్లు లేక సినిమాలు తీసి తీసి విసిగి పోయి చివరకు క్యారెక్టర్ రోల్స్ చేసుకునే స్థాయికి వచ్చేశాడు.చివరకు తారకరత్నకు క్యారెక్టర్ రోల్స్ కూడా పెద్ద సినిమాల్లో దక్కని పరిస్థితి.కానీ తారకరత్నతో పోలిస్తే నారా రోహిత్ ఇది మరో విచిత్రమైన పరిస్థితి.nara-rohit-photos-at-samanthakamani-movie-teaser-launch-2

బాణం లాంటి వైవిధ్యమైన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి సోలో లాంటి మంచి హిట్ కొట్టి రౌడీ ఫెలో లాంటి వైవిధ్యమైన సినిమా విమర్శకుల ప్రశంసలు పొందిన నారా రోహిత్ తన స్థాయికి తగిన హిట్లు ఇవ్వలేక పోతున్నాడు. నారా రోహిత్ మంచి కథాబలం ఉన్న సినిమాలు కమర్షియల్‌గా మాత్రం అవి సక్సెస్ కావడం లేదు. రోహిత్‌కు స్టార్ డం లేదు, గత రెండేళ్లలో రోహిత్ పదికి పైగా సినిమాలు చేసిన ఉపయోగం లేదు వాటిలో సరైన కమర్షియల్ హిట్ లేదు, కనీసం రోహిత్ మార్కెట్ పెరగలేదు.

తాజాగా నారా రోహిత్ ముగ్గురు హీరోలతో కలిసి నటిస్తున్న వీరబోగ వసంత రాయలుకు ఏమాత్రం బజ్ లేదు . రోహిత్ సినిమాలకు బాలయ్య చీఫ్ గెస్ట్ గా వస్తున్న నందమూరి అభిమానుల అండ ఉన్న కనీసం ఓపెనింగ్స్ కూడా ఉండటం లేదు. ఓవరాల్ గా చూస్తే కథాబలం ఉన్న సినిమాలు రోహిత్ ఎంచుకుంటున్న అందులో కమర్షియల్ తోపాటు అతనిని డైరెక్టర్లు కూడా అనుభవం లేక ప్లాపులు ఇస్తుండడంతో రోహిత్ కు ఉపయోగం ఉండడం లేదు. మరి రోహిత్ ఎప్పటికైనా తన కెరీర్‌ను సరైన ట్రాక్‌లో తీసుకొస్తాడేమో చూడాలి.

నందమూరి అండ ఉన్న లేవలేకపోతున్నాడే ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share