ఫ‌స్ట్ డే కుమ్మేసిన ‘ అ ‘ … సాలిడ్ ఓపెనింగ్స్‌

February 17, 2018 at 3:50 pm
awe-nani

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో సూప‌ర్ క్రేజ్ ఉంటుంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ – నేను లోక‌ల్ – నిన్నుకోరి సినిమాల‌తో నాని అక్క‌డ మిలియ‌న్ మార్క్ మంచినీళ్లు తాగిన‌ట్టుగా కొట్టేస్తున్నాడు. చివ‌ర‌కు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న నాని చివ‌రి సినిమా ఎంసీఏ సినిమా సైతం వ‌సూళ్ల‌లో దుమ్ము దులిపేసిందంటే నాని రేంజ్‌, క్రేజ్ రెండూ బాగా పెరిగిపోయాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఇక తాజాగా నాని పూర్తిస్థాయి నిర్మాత‌గా మారి నిర్మించిన సినిమా అ. నానికి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు చాలా యూజ్ అయ్యింది. శుక్ర‌వారం రిలీజ్ అయిన అ సినిమాకు ముందే ప్రివ్యూల ద్వారా సెల‌బ్రిటీల నుంచి పాజిటివ్ బ‌జ్ వ‌చ్చింది. ఇక ప్రేక్ష‌కుల్లో కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తోంది. ఏ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీఫ్లెక్స్, ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల నుంచి అ సినిమాకు అదిరిపోయే రిపోర్టులు వ‌స్తున్నాయి.

ఈ పాజిటివ్ రిపోర్టుల‌తో అ సినిమాకు ఫ‌స్ట్ డే సాలిడ్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ప్రీమియర్ల ద్వారా 1.26 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా ఫ‌స్ట్ డే శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు వ‌చ్చిన రిపోర్టుల‌ను బ‌ట్టి 2.25 లక్షల డాలర్లను రాబట్టి రెండవ రోజు కూడా మంచి ప్రారంభాన్ని పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఫస్ట్ డే ఏ సెంట‌ర్ల నుంచి మంచి ఓపెనింగ్స్ ద‌క్కాయి. ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు ప‌రిచయం అవ్వ‌గా, టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ద‌ర్శ‌కుడు ట‌చ్ చేయని కొత్త జాన‌ర్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు.

ఫ‌స్ట్ డే కుమ్మేసిన ‘ అ ‘ … సాలిడ్ ఓపెనింగ్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share