శ్రీరెడ్డి కొత్త వీడియో.. పాపం నాని !

June 13, 2018 at 9:39 am
nani-srireddy

తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నేచుర‌ల్ స్టార్ నాని త‌న‌ను వాడుకున్నాడ‌ని… తన‌ను నాని త‌న ద‌గ్గ‌ర ప‌డుకోబెట్టుకున్నాడ‌ని న‌టి శ్రీరెడ్డి త‌న సంచ‌ల‌నాల ప‌ర్వంలో ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా నానిని టార్గెట్ చేస్తోన్న ఆమె తాజాగా నానిపై ఆరోప‌ణ‌ల తీవ్ర‌త పెంచేసింది. నాని నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు… నువ్వు నా ద‌గ్గ‌ర ప‌డుకున్నావా ?  లేదా ? అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో నాని చివ‌ర‌కు ఆమెకు లీగ‌ల్ నోటీసులు ఇచ్చే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

 

నాని వీటిని లైట్ తీస్కోవాల‌నుకున్నా ఆయ‌న భార్య తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు లోన‌వ్వ‌డంతో చివ‌ర‌కు నాని శ్రీరెడ్డికి లీగ‌ల్ నోటీసులు ఇవ్వాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది. నాని లీగల్ నోటీసులపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని… తాను దీనిని ఎదుర్కొనేందుకు ఎంత‌వ‌ర‌కు అయినా రెడీయే అని శ్రీరెడ్డి చెపుతోంది. తన పుట్టినరోజును జరుపుకోవడానికి కేరళకు వెళ్లిన ఆమె తాను ఎయిర్ పోర్ట్ లో ఉండగానే నాని లీగ‌ల్ నోటీసుల‌పై స్పందిస్తూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నానిని ఎదుర్కొనేందుకు రెడీ అని చెప్పింది. 

 

నాని త‌న‌కు లీగ‌ల్ నోటీసులు పంపినందుకు చాలా హ్యాపీగా ఉంద‌ని చెప్పిన ఆమె నానికి అదిరిపోయే రేంజ్‌లో ఆన్స‌ర్ ఇస్తాన‌ని చెప్పింది. నాని తప్పు చేశాడని త‌న మనసాక్షికి తెలుసని చెప్పుకొచ్చింది. నాని తనకు సంబందించిన ప్రతీ విషయాన్ని తన భార్యకు చెబుతూవుంటాడని తాను తెలుసుకున్నట్లు చెప్పింది. మ‌రి త‌మ మ‌ధ్య ఉన్న ఎఫైర్ త‌న భార్య‌కు చెప్పాడో ?  లేదో ?  గాని కేర‌ళ నుంచి వ‌చ్చాక అంద‌రికి వ‌ణుకు తెప్పించేలా నాని మీద ఫైట్ ఉంటుంద‌ని శ్రీరెడ్డి చెప్పింది. మ‌రి శ్రీరెడ్డి ఏదైనా ఆధారాలు చూపిస్తుందా ?  లేదా ?  ఈ ఆరోప‌ణ‌ల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అన్న‌ది చూడాలి.

శ్రీరెడ్డి కొత్త వీడియో.. పాపం నాని !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share