బిగ్ బాస్‌-2 నెగిటివ్ టాక్‌…నానికి అప్పుడే క‌ష్టాలు

June 11, 2018 at 12:07 pm
nan-big boss -

బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ చూస్తోన్న ప్రేక్ష‌కుల్లో ఆ సీజ‌న్‌కు హోస్ట్‌గా ఉన్న టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ చూపించిన జోష్ అలాంటిది ఇలాంటిది కాదు. ఆ షోను ఎన్టీఆర్ సింగిల్ హ్యాండ్‌తో హిట్ చేశాడు. ఇప్పుడు రెండో సీజ‌న్‌కు ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉండ‌డంతో నేచుర‌ల్ స్టార్ నానిరి స్టార్ మా వాళ్లు రంగంలోకి దింపారు. సోమ‌వారం చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ -2 స్టార్ట్ అయ్యింది. 

 

మొత్తం 16 మంది పార్టిసిపెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. షో మొత్తం 100 రోజుల పాటు జ‌ర‌గ‌నుంది. అయితే జ‌నాలకు షాక్ ఇచ్చేలా పార్టిసిపెంట్స్ ఎంపిక ఉంద‌న్న టాక్ అయితే వ‌చ్చేసింది. చాలా మంది పార్టిసిపెంట్స్ ఎంపిక చూసి పెద‌వి విరుస్తున్నారు. పార్టిసిపెంట్స్ విష‌యంలో చాలా ఆశ‌ల‌తో ఉన్న ప్రేక్ష‌కులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారిని చూసి అంత సంతృప్తిగా అయితే లేరు.

 

ఇక ఎన్టీఆర్ హోస్టింగ్‌తో నానిని కంపేరిజ‌న్ చేసి చూస్తోన్న వారు నానికి ఎన్టీఆర్‌కు వేసిన మార్కుల్లో స‌గం కూడా వేయ‌డం లేదు. ఇక తొలి రోజు ఎపిసోడ్ రెండున్నర గంటలు కావడం వల్ల బుల్లితెర ఆడియెన్స్‌కు కాస్త విసుగు వచ్చిందని చెప్పాలి. బిగ్ బాస్-2 మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 

 

ఇక నాని ఇంకాస్త మెళ‌కువ‌లు చూపించ‌డంతో పాటు మ‌రింత స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తేనే బిగ్ బాస్ -2 సీజ‌న్ ర‌క్తిక‌డుతుంద‌ని లేకుంటే కష్ట‌మే అన్న టాక్ వినిపిస్తోంది.  సినిమాల్లో చేయడం వేరు బుల్లితెర మీద హోస్ట్ చేయడం వేరు. సినిమాల్లో టేకుల‌కు ఛాన్స్ ఉంటుంది… ఇక్క‌డ ఆ ఛాన్స్ ఉండ‌దు… ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ షోను ఇంట్ర‌స్టింగ్‌గా మ‌లిచేందుకు ముందు చాలా హోం వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. మ‌రి నాని ఏం చేస్తాడో ?  చూడాలి.

బిగ్ బాస్‌-2 నెగిటివ్ టాక్‌…నానికి అప్పుడే క‌ష్టాలు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share