సుధీర్ సరదా బాగుంది…కానీ కలెక్షన్స్!

September 22, 2018 at 5:57 pm

సాధారణంగా సినిమా హీరోలు తమ సినిమా రిలీజ్ కి ముందు..రిలీజ్ తర్వాత తెగ భయపడిపోతూ..బాధపడి పోతూ ఉంటారు. ఇక సినిమా సక్సెస్ టాక్ వచ్చిందా అంటే..ఎగిరి గంతేస్తారు. ఆ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చేందుకు..సక్సెస్ మీట్..విజయ యాత్రలు చేస్తూ జనాల్లో జోష్ నింపుతుంటారు. ఆ సమయంలో హీరోలను కలవాలన్నా..వారితో ఫోటోలు తీయించుకోవాలన్నా అభిమానులు తెగ ఇబ్బంది పడి పోతుంటారు. ఇక థియేటర్లోకి హీరోలు వస్తే..తెగ హడావుడి ఉంటుంది..బౌన్సర్లు, ఇలా రకరకాల వ్యవహారాలు వుంటాయి.IMG-20180922-WA00021537611855

కానీ హీరో సుధీర్ బాబు ఒక కొత్త ట్రెండ్ కు తెరతీసాడు. తాజాగా తన సొంత బ్యానర్ లో రిలీజ్ అయిన ‘నన్నుదోచుకుందువటే’ ప్రదర్శిస్తున్న థియేటర్లకు మారు వేషం వేసుకుని వెళ్లే కార్యక్రమం స్టార్ట్ చేసాడు. ఇలా మారువేశాల్లో వెళ్లిన సుదీర్ బాబును ఎవరూ గుర్తు పట్టడం లేదట..థియేటర్ల దగ్గర ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా గుర్తు పట్టినా..వాళ్లతో సరదాగా సెల్ఫీదిగి వచ్చేస్తున్నాడు. సిటీలోని థియేటర్లలో శనివారం ఈ విధంగా పర్యటించిన సుధీర్ బాబు, ఆంధ్ర సీడెడ్ ల్లో కూడా ఈ వారం అంతా ఇలాగే పర్యటిస్తాడట. అంతేకాదు తాను ఏ థియేటర్లోకి వెళ్తాడో ఎవ్వరికీ చెప్పడట..టాప్ సీక్రెట్. చూడాలి ఈ వైరైటీ కార్యక్రమం, ప్లస్ మౌత్ టాక్ మనోడికి ఎలాంటి ప్లస్ లేదా మైనస్ అవుతుందో.

ఓ వైపు హీరోలుగా నటిస్తూ..తమ సొంత బ్యానర్ మొదలు పెట్టి స్వయంగా నటించడం ఎప్పటి నుంచో వస్తున్న ట్రెండ్..ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ రీసెంట్ గా నాగశౌర్య..ఇప్పుడు సుధీర్ బాబు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో తనే హీరోగా మొదటి ప్రయత్నంగా నిర్మించిన నన్ను దోచుకుందువటే మంచి రిపోర్ట్స్ తో పాటు పబ్లిక్ టాక్ కూడా బాగా రావడంతో సుధీర్ బాబు బాగా హ్యాపీగా ఉన్నాడు. మొదలుపెట్టిన నిర్మాత మధ్యలోనే డ్రాప్ అయితే కథ దర్శకుడు నచ్చడంతో పెట్టుబడికి సై అన్నాడు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యింది. పోటీగా వచ్చిన సామీతో పాటు ఈ మాయ పేరేమిటో అంచనాలు అందుకొవడంలో విఫలం కావడంతో వీక్ ఎండ్ ని వాడుకోవచ్చు. ఈ సినిమా కామెడీ బాగా పండిందని..సెంటిమెంట్ కూడా బాగా వర్క్ ఔట్ అయ్యిందని అంటున్నారు. ఈ వీక్ లో ఏ పోటీ లేదు కనుక కలెక్షన్లు కూడా బాగానే కలిసి వచ్చేలా ఉన్నాయని అంటున్నారు.

సుధీర్ సరదా బాగుంది…కానీ కలెక్షన్స్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share