నెపోలియ‌న్‌ TJ రివ్యూ

TJ రివ్యూ: నెపోలియ‌న్‌

టైటిల్‌: నెపోలియ‌న్‌

జాన‌ర్‌: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌

బ్యాన‌ర్‌: ఆచార్య క్రియేష‌న్స్, ఆనంద్ ర‌వి కాన్సెప్ట్స్

న‌టీన‌టులు: ఆనంద్ రవి, కోమలి, రవి వర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ తదితరులు

ఆర్ట్‌: బాబ్జి

ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌

సినిమాటోగ్ర‌ఫీ: మార్గ‌ల్ డేవిడ్‌

మ్యూజిక్‌: సిద్ధార్థ్ స‌దాశివుని

నిర్మాత: భోగేంద్ర గుప్త

దర్శకత్వం: ఆనంద్ రవి

రిలీజ్ డేట్‌: 24 న‌వంబ‌ర్‌, 2017

నారా రోహిత్ హీరోగా తెర‌కెక్కిన ప్ర‌తినిధి సినిమాతో ర‌చ‌యిత‌గా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ ర‌వి ద‌ర్శ‌కుడిగాను, హీరోగాను మారి తెర‌కెక్కించిన సినిమా నెపోలియ‌న్‌. నా నీడ క‌న‌ప‌డ‌డం లేదంటూ హీరో పోలీసుల‌కు ఫిర్యాదు చేసే ట్రైల‌ర్ నుంచే ఈ సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఆస‌క్తి ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల్లో ఏర్ప‌డింది. ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ  స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

నెపోలియన్(ఆనంద్ రవి) అనే వ్యక్తి తన నీడ పోయిందని, ఆ విషయాన్ని కలలో దేవుడు కనిపించి చెప్పాడ‌ని పోలీసుల‌కు కంప్లైంట్ చేస్తాడు. షాక్ అయిన పోలీసులు అత‌డిని ప‌రీక్షించి చూస్తే నిజంగానే నీడ క‌న‌ప‌డ‌దు. డాక్ట‌ర్ల‌కు చూపించినా పోలీసులు అందుకు త‌గ్గ కార‌ణం చెప్ప‌లేక‌పోతారు. ఈ కేసును డీల్ చేసే విష‌యంలో గంద‌ర‌గోళంలో ఉన్న పోలీసుల‌కు ఓ యాక్సిడెంట్ కేసును హ‌త్య కేసు అని చెప్పి రీ ఓపెన్ చేయిస్తాడు. అత‌డు చెప్పేవ‌న్ని నిజాలే కావ‌డంతో పోలీసులు షాక్ అవుతుంటారు. ఇదిలా ఉంటే అత‌డు నెపోలియ‌న్ కాదు త‌న భ‌ర్త అశోక్ అని  అమ్మాయి (కోమ‌లి) వ‌స్తుంది. అస‌లు నెపోలియ‌న్ ఎవ‌రు ? అత‌డి నీడ ఎలా పోయింది ?  మ‌రి అశోక్ ఎవ‌రు ?  వీరికి తిరుప‌తితో ఉన్న లింక్ ఏంటి ?  నెపోలియ‌న్ నీడ తిరిగి వ‌చ్చిందా ?  లేదా ? అన్న ప్ర‌శ్న‌ల‌కే స‌మాధాన‌మే ఈ సినిమా.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ :

న‌టీన‌టుల గురించి మాట్లాడేస్తే ఆనంద్ ర‌వి ఓ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు అని చెప్పే నెపోలియన్ పాత్రలోనూ… ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడే అశోక్ పాత్రలోనూ చూపించిన డిఫెరెన్స్ గుడ్‌. అత‌డి భార్యగా చేసిన కోమ‌లి కూడా క్రూర‌మైన రోల్‌లో మెప్పించింది. ఆనంద్ ర‌వి చెప్పిన పంచ్‌లు పేలాయి. ఇక ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యితగా ఆనంద్ ర‌వి త‌న‌లో ప్ర‌తిభ‌ను పూర్తిగా వాడుకుంటూ మంచి క‌థ‌నం రాసుకున్నాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రాసుకున్న ఈ క‌థ‌, క‌థ‌నాల్లో చాలా హైలెట్సే ఉన్నాయి. 

హీరో నీడ‌క‌నిపించ‌కుండా పోవ‌డం, పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చిన వాళ్ల‌ను క‌న్‌ఫ్యూజ్‌కు గురి చేసి మూసివేసిన కేసును రీ ఓపెన్ చేయించ‌డం లాంటి సీన్లు ప్రేక్ష‌కుడిని థ్రిల్‌కు, ఆస‌క్తికి గురి చేశాయి. నీడ క‌నిపించ‌కుండా పోయినందుకు ఎలాంటి కార‌ణాన్ని చూపిస్తారో ? అన్న‌ది పెద్ద ఆస‌క్తిని రేపింది. సినిమాలో సామాజిక అంశాలు ట‌చ్ చేయ‌డం బాగుంది.  ఫ‌స్టాఫ్‌లో నీడ క‌నిపించ‌డం లేద‌నే ఇష్యూ, మ‌ర్డ‌ర్ జ‌ర‌గ‌డం, మ‌ర్డ‌ర్ వెన‌క ఉన్న బ‌ల‌మైన రీజ‌న్ ప్రేక్ష‌కుల్లో సెకండాఫ్ మీద బాగా ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే సెకండాఫ్‌లో ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే కాస్త అంచ‌నాలకు రీచ్ కాలేద‌నిపిస్తుంది. 

టెక్నిక‌ల్‌గా చూస్తే….

హీరో ఆనంద్ ర‌వినే దర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌వి ర‌చ‌యిత‌గా ఫ‌స్టాఫ్‌ను ఎంతో స‌స్పెన్స్‌తో న‌డిపించి ఉత్కంఠ‌ను మెయింటైన్ చేసి సెకండాఫ్‌లో కాస్త తేల్చేసిన‌ట్టు ఉంది. సెకండాఫ్‌ను కూడా అదే టెంపోతో న‌డిపించి ఉంటే సినిమా రేంజ్ మ‌రింతా పెరిగి ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మార్గాల డేవిడ్ సినిమాటోగ్రఫీ, సిద్దార్థ్ సదాశివుని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేయాల్సింది.

ఫైన‌ల్‌గా…

హై క్లాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌