‘ క‌థ‌లో రాజ‌కుమారి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… నారా రోహిత్ మళ్ళీ కొట్టినట్టేనా ?

September 15, 2017 at 4:58 am
add_text

నారా రోహిత్ హీరోగా, మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథలో రాజకుమారి. ఎప్పుడో ఆరేడు నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకుని వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్ర‌కారం క‌థ‌లో రాజ‌కుమారికి ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం.

ఈ షో చూసిన ఓవర్సీస్ ప్రేక్ష‌కులు జుట్టుపీక్కుంటున్నార‌ట‌. నారా రోహిత్ సినిమా అంటే హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమా చూసే ఫ్యాన్స్ ఉంటారు. రోహిత్ ఎంచుకునే క‌థ‌లు చాలా డిఫ‌రెంట్‌గా, కొత్త జాన‌ర్‌లో ఉంటూ ఉంటాయి. అయితే అస‌లు ఈ సినిమాను మాత్రం రోహిత్ ఎందుకు ఎంచుకున్నాడో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేద‌ట‌.

ఈ సినిమా క‌థ‌ను రోహిత్ విన‌కుండానే ఓకే చేశాడా ? అన్న సందేహాలు చాలా మంది ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌మ్యం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో రెండు గంట‌ల పాటు సినిమాను బాగా బోర్ కొట్టించేశార‌ట‌. రాజ‌కుమారిలో మ‌రో కీ రోల్ చేసిన నాగ‌శౌర్య పాత్ర ఈ సినిమాకు గాని, అత‌డి కెరీర్‌కు గాని ఎలాంటి ఉప‌యోగం లేదు.

గ‌తేడాది ఏడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఆరు ప్లాప్‌లు ఎదుర్కొన్న నారా రోహిత్‌కు ఈ క‌థ‌లో రాజకుమారితో మ‌రో డిజాస్ట‌ర్ సినిమా అత‌డి అక్కౌంట్‌లో ప‌డిందంటున్నారు. వ‌రుస ప్లాపుల‌తో మార్కెట్ డౌన్ చేసుకుంటోన్న రోహిత్‌కు ఈ సినిమా క‌నీస ఓపెనింగ్స్ కూడా తేవ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. 

‘ క‌థ‌లో రాజ‌కుమారి ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… నారా రోహిత్ మళ్ళీ కొట్టినట్టేనా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share