ముఖం అందంగా..కాంతివంతం ఉండాలంటే ఇలా చేయండి!

July 21, 2018 at 9:52 am

ముఖం అందంగా, నునుపుగా ఉండాలని అనుకోవటం సహజం. ముఖచర్మంపై ఉన్న స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవటంతో పాటు ముఖం జిడ్డుగా తయారయినపుడు వెంటనే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల్ని కొని ఉపయోగిస్తుంటారు. దీని వల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి ముఖం అందాన్ని కోల్పోతుంది. 

 

ఇలా కాకుండా అందమైన ముఖం కోసం ఇంటిలోనే సులభమైన చికిత్సలను నిర్భయంగా వాడుకోవచ్చు.  ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య “మొటిమలు”.వీటి నివారణకు ఈ చిట్కాను తెలుసుకుందాం… గులాబి, బచ్చలి ఆకులను తీసుకుని మెత్తగా రుబ్బి మొటిమల మీద రాస్తూ ఉంటే పదిహేను రోజుల్లోనే తేడాను గమనించవచ్చు.

 

  1. అందమైన మోము కోసం పచ్చిపాలతో.. ముఖం తెల్లగా ఉండాలని అందరికీ ఆశ గా ఉంటుంది.కానీ ఉన్న రంగులోనే ముఖం ఇంకొంచెం ఛాయ పెరిగేలా, ముఖం నునుపు గా వచ్చేలా చేయొచ్చు. అదేంటో తెలుసుకుందాం ఈ చిట్కా లో.. పచ్చిపాలు, మంచి గంధం సరిపడా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాత్రమే కాక, మెడకు, చేతులకు పట్టించి ఆరాక చల్ల నీటితో కడిగేయండి.

 

2.చందనం,బాదం,తేనె మరియు పెరుగు అన్నింటిని కలిపి పేస్ట్ చేయండి. మీ ముఖం మరియు మెడ మీద ఈ పేస్ట్ ను ప్రతి రోజు రాసి,పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి.

 

  1.  మీ కనుబొమ్మలను ఒక ప్రొఫెషనల్ తో షేపింగ్ చేయించండి. అప్పుడు నిజంగా మీ మొత్తం లుక్ మారుతుంది. మందపాటి కనుబొమ్మ లు ఉంటే,అవి మీ ముఖంకు ఒక యువ మరియు మృదువైన లుక్ ఇస్తాయి. 

 

4.తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. 

 

5.నీటిలో కీరదోస రసం గాని, ఆపిల్‌ రసం గాని, గ్రీన్‌ టీ గాని కలిపి ఫ్రిజ్‌లో ఐస్‌గా చేసి గుడ్డను మూటకట్టి ముఖంపైన కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది. చూడగానే ముఖ చర్మం నున్నగా కనపడుతుంది. 

 

6.బాదం పేస్ట్ మరియు మెత్తని పండిన బొప్పాయి గుజ్జు కలిపి మీ ముఖానికి పట్టించి హాయిగా విశ్రాంతిగా పడుకోండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత మృదువైన స్చ్రబ్ తో శుభ్రం చేసి మరియు ట్యాప్ నీటితో కడగాలి. 

 

7.అందమైన ముఖచర్మం కోసం పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆయిల్‌ ఫేస్‌లో ఉండే జిడ్డును పెరుగు పోగొడుతుంది. ముఖంపై తేనెను రాస్తే చక్కని ఫలితం ఉంటుంది. 

 

8.శనగపిండి,చిటెకెడు పసుపు,పెరుగు కలిపి పేస్ట్ చేసి ప్రతి రోజు ముఖానికి రాయాలి. అది ఆరిపోయిన తరువాత వృత్తాకార కదలికలను ఉపయోగించి శుభ్రంగా కడగాలి.

ముఖం అందంగా..కాంతివంతం ఉండాలంటే ఇలా చేయండి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share