‘నేనే రాజు నేనే మంత్రి’ TJ రివ్యూ

టైటిల్‌: నేనే రాజు నేనే మంత్రి

జాన‌ర్‌: పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌

సమర్పణ: డి.రామానాయుడు

నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్ – బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు

మ్యూజిక్‌: అనూప్‌ రూబెన్స్‌

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌

నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ

రిలీజ్ డేట్‌: 11 ఆగ‌స్టు, 2017

రానా ద‌గ్గుపాటికి కెరీర్‌లో బాహుబ‌లి త‌ప్ప పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లేదు. అయినా వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. లీడ‌ర్‌, ఈ యేడాది వ‌చ్చిన ఘాజీ, ఇప్పుడు తాజాగా నేనే రాజు నేనే మంత్రి ఇలా రానా ప్ర‌తి సినిమాకు క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండేలా చూసుకుంటున్నాడు. అప్పుడెప్పుడో వ‌రుస హిట్లు కొట్టిన తేజ‌కు ప‌దేళ్లుగా స‌రైన హిట్ లేదు. ఆ తేజ దర్శకత్వంలో రానా నటించిన చిత్రమే నేనే రాజు నేనే మంత్రి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో అంచ‌నాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఎత్తులు, పై ఎత్తుల‌తో సాగే క‌థే నేనే రాజు నేనే మంత్రి. భార్య భ‌ర్త‌లు అయిన జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) ఒకరంటే ఒకరికి ప్రాణం. వ‌డ్డీవ్యాపారం చేసుకునే జోగేంద్ర భార్య రాధ‌కు ఆ ఊరి స‌ర్పంచ్ (ప్ర‌దీప్ రావ‌త్‌) భార్య వ‌ల్ల గ‌ర్భం పోతుంది. భార్య కోరిక మేర‌కు జోగేంద్ర స‌ర్పంచ్ అవుతాడు. ప‌ద‌వి పోయిన మాజీ స‌ర్పంచ్ జోగేంద్ర‌ను చంపాల‌నుకుంటుంటే జోగేంద్రే అత‌డిని చంపేస్తాడు. జోగేంద్ర క్రేజ్ చూసిన ఎమ్మెల్యే చౌడ‌ప్ప (స‌త్య‌ప్ర‌కాష్‌) అత‌డిని కేసునుంచి త‌ప్పిస్తాడు.

ఈ కేసు నుంచి జోగేంద్ర‌ను త‌ప్పించేందుకు ఎమ్మెల్యేకు సీఐ(అజ‌య్‌) హెల్ఫ్ చేస్తాడు. చివ‌ర‌కు వారిద్ద‌రు జోగేంద్ర‌ను డ‌బ్బులు అడుగుతారు. అప్పటికే రాజ‌కీయంగా ఆరితేరిపోయిన జోగేంద్ర తెలివిగా సీఐను ట్రాన్స్‌ఫ‌ర్ చేయించి, ఎమ్మెల్యేను చంపేసి ఎమ్మెల్యే అవుతాడు. త‌న‌ ఎదుగుద‌ల‌లో స‌హాయ‌ప‌డిన శివ‌(న‌వదీప్‌)ను జోగేంద్ర ప్ర‌త్య‌ర్థుల గేమ్ తెలియ‌కుండా చంపేస్తాడు. అక్క‌డ నుంచి జోగేంద్ర ఏకంగా సీఎం కావాల‌ని క‌ల‌లు కంటుంటాడు. ఈ క్ర‌మంలో జోగేంద్ర సాధించింది ఏంటి ? పోగొట్టుకుంది ఏంటి ? ఈ సినిమా ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది అన్న‌దే మిగిలిన స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే సినిమా అంతా మెయిన్‌గా రానా, కాజ‌ల్‌మీదే న‌డుస్తుంది. జోగేంద్ర‌గా రానా, రాధగా కాజ‌ల్ త‌మ పాత్ర‌ల్లో అలా ఒదిగిపోయారు. రానా బాహుబ‌లి సినిమాతో పోల్చుకుంటే త‌న బాడీ లాంగ్వేజ్‌ను చ‌క్క‌గా మార్చుకుని కొత్తగా ట్రై చేశాడు. పంచెక‌ట్టులో పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా అద‌రొగొట్టాడు. కాజ‌ల్ హోమ్లీ పాత్రలో చ‌క్క‌గా న‌టించింది. ఇక ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిట‌ల్ సీన్‌లో కూడా కాజ‌ల్ న‌ట‌న మెప్పిస్తుంది.

న‌వ‌దీప్ కీల‌క పాత్ర‌లో న‌టించినా ఫ‌స్టాఫ్ వ‌ర‌కే అత‌డి పాత్ర ప‌రిమిత‌మైంది. ఇక విల‌న్‌గా చేసిన అశుతోష్ రానా, సెటైరికల్ డైలాగ్స్‌తో పోసాని కృష్ణ‌ముర‌ళీ మెప్పించారు. వాడు జోగేంద్ర అనే డైలాగ్‌తో ప్ర‌భాస్ శ్రీను న‌వ్విస్తే, దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌:

టెక్నిక‌ల్‌గా చూస్తే అనూప్ మ్యూజిక్ ఓకే. నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. ఆర్ ఆర్ కూడా ఓకే. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. రానా సందర్భానుసారం చెప్పే సామెతలు. పదవుల్లో ఉన్నవాళ్లే బాగుంటారు. పక్కనుండేవాళ్లు బాగుండరు. అన్న వస్త్రాలు కావాలంటే ఉన్న వస్త్రాలు పోతాయి, వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హోటల్‌లో పెడితే నేను అవుతాను సీఎం…శత్రువు కూడా పాఠాలు నేర్పుతాడని తెలిసింది డైలాగులు పేలాయి. ఎడిటింగ్‌లో కొన్ని సాగ‌దీత సీన్ల‌ను ట్రిమ్ చేయాల్సి ఉంది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.

తేజ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

ద‌ర్శ‌కుడు తేజ‌ను ఇప్పటికే చాలా మంది మ‌ర్చిపోయారు. వ‌రుస ప్లాపుల‌తో ఎక్క‌డికో వెళ్లిపోయిన తేజ ఇప్పుడు కొత్త‌గా పొలిటిక‌ల్ జాన‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమాను తీశారు. ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించిన తేజ ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి ప్రయాణాన్ని తేజ తెరకెక్కించే ప్రయత్నమే ఈ చిత్రం. స్క్రీన్‌ప్లే పరంగా క్లారిటీతో సినిమా సాగుతుంది. ఫ‌స్టాఫ్ అదిరిపోయినా సెకండాఫ్‌లో మాత్రం తేజ అక్క‌డ‌క్క‌డా త‌డ‌బడిన‌ట్టు ఉంది.

ప్లస్ పాయింట్స్ (+):

– కథ

– రానా, కాజ‌ల్‌

– తేజ దర్శకత్వం

– ఫస్ట్ హాఫ్

– అనూప్ రూబెన్స్ సంగీతం

మైనస్ పాయింట్స్ (-):

– సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

– ప్రీ క్లైమాక్స్

ఫైన‌ల్‌గా..

తేజ ఈజ్ బ్యాక్‌.. ఫ‌స్టాఫ్ చాలా బాగుంది… సెకండాఫ్ ఓ మోస్త‌రుగా ఉంది

నేనే రాజు నేనే మంత్రి TJ రేటింగ్‌: 2.75 / 5