‘ నేనే రాజు నేనే మంత్రి ‘ క‌లెక్ష‌న్స్‌లోనూ రారాజే

ఎప్పుడో ఏడేళ్ల క్రితం లీడ‌ర్ సినిమాతో వెండితెరంగ్రేటం చేసిన ద‌గ్గుపాటి వారి వార‌సుడు రానాకు కెరీర్‌లో సోలోగా ఒక్క హిట్టూ లేదు. బాహుబ‌లి సినిమాలో విల‌న్ పాత్ర‌కు రానాకు వ‌చ్చిన క్రేజ్‌తోనే ఇండియా వైజ్‌గా పాపుల‌ర్ అయ్యాడు. రానా మ‌ధ్య‌లో హిందీ, త‌మిళ్ సినిమాలు చేసి అక్క‌డ కూడా పాపుల‌ర్ అయ్యేందుకు ట్రై చేశాడు. బాహుబలి సినిమాలో భ‌ళ్లాల‌దేవుడి పాత్ర‌లో రానా న‌ట‌న‌తో మ‌నోడి క్రేజ్ స్కైను ట‌చ్ చేసింది.

ఇక ఈ యేడాది బాహుబ‌లి 2తో పాటు ఘాజీ లాంటి ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన రానా లేటెస్ట్‌గా తేజ ద‌ర్శ‌క‌త్వంలో నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తేజ – రానా కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డ‌మే ఓ గ్రేట్‌.

ఎప్పుడో మ‌న చిన్న‌ప్పుడు 2003లో జ‌యం సినిమాతో హిట్ కొట్టిన తేజ మ‌ళ్లీ హిట్ మొఖం చూడ‌లేదు. 14 సంవ‌త్స‌రాల త‌ర్వాత తేజ చెప్పిన క‌థ‌పై న‌మ్మ‌కంతో రానా, సురేష్‌బాబు ఈ క‌థ‌ను ఓకే చేశారు. లై, జ‌య జాన‌కి నాయ‌క సినిమాల‌తో పాటు రిలీజ్ అయిన రాజు మంత్రి తొలి రోజు నుంచే పైచేయి సాధించి 10 రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 21.15 కోట్ల షేర్ సాధించింది.

సినిమాలో క‌థాంశంతో పాటు, రానా న‌ట‌న‌, సురేష్‌బాబు ప్లానింగ్‌, ప్ర‌మోష‌న్లు, ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవ్వ‌డం ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చాయి.

నేనే రాజు నేనే మంత్రి 10 డేస్ ఏరియా వైజ్ షేర్‌:

నైజాం – 7.09 కోట్లు

సీడెడ్ – 2.46

ఉత్త‌రాంధ్ర – 2.30

గుంటూరు – 1.39

ఈస్ట్ – 1.60

వెస్ట్ – 0.85

కృష్ణా – 1.38

నెల్లూరు – .0.53

——————————-

ఏపీ+తెలంగాణ = 17.60

———————————

రెస్టాఫ్ ఇండియా – 1.50

ఓవ‌ర్సీస్ – 2.05

———————————————-

10 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ = 21.15 కోట్లు

————————————————