నిఖిల్ కిర్రాక్ క‌లెక్ష‌న్స్‌… రెండు రోజుల్లో ఎంత కొట్టేశాడంటే

March 19, 2018 at 11:04 am
nikhil-kirak party

యంగ్ హీరో నిఖిల్‌కు కాలం క‌లిసొస్తోంది. ఇటీవ‌ల వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోన్న నిఖిల్ లేటెస్ట్ సినిమా కిరాక్ పార్టీ. క‌న్న‌డ‌లో ఆల్రెడీ హిట్ అయ్యి కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు రీమేక్ కిరాక్ పార్టీ ఈ శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. నిఖిల్ మాంచి ఫామ్‌లో ఉన్నా ఈ సినిమాపై ట్రేడ్ వ‌ర్గాల్లో పెద్ద బ‌జ్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ రూ.10 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి.

 

అక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. సినిమాకు తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. సినిమా అంత గొప్ప‌గా ఏం లేద‌ని అటు రివ్యూవ‌ర్లు, ఇటు విమ‌ర్శ‌కులు కూడా పెద‌వి విరిచారు. దీంతో నిఖిల్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద మ్యాజిక్ చేస్తాడ‌ని కూడా ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అయితే సినిమా మాత్రం వ‌సూళ్ల ప‌రంగా అంచ‌నాల‌ను మించింది. తొలి రోజు రూ.6 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ 2.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

 

ఇక ప్రస్తుతం థియేట‌ర్ల బంద్ త‌ర్వాత పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం కూడా ఈ సినిమాకు క‌లిసొచ్చింది. రెండు రోజుల‌కు కిరాక్ పార్టీ కిర్రాక్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. రూ.10 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. బీ, సీ సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమా ఈ సినిమాకు ప‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్లు వ‌స్తున్నాయి. 

 

ఇక ఓవ‌రాల్‌గానే ఈ సినిమాను రూ.10 కోట్ల‌కు అమ్మారు. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లోనే ఆ వ‌సూళ్లు రాబ‌ట్టేసి కిరాక్ పార్టీ లాభాల దిశ‌గా దూసుకుపోనుంది.  మొత్తంగా నిఖిల్ యావ‌రేజ్ కంటెంట్‌తో మ‌రో హిట్ కొట్టేశాడు.

నిఖిల్ కిర్రాక్ క‌లెక్ష‌న్స్‌… రెండు రోజుల్లో ఎంత కొట్టేశాడంటే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share