హీరో నితిన్ పెళ్లికొడుకాయ‌నే..

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో యంగ్ హీరో నితిన్ ఒక‌రు. సెకండ్ ఇన్సింగ్స్‌లో నితిన్ కెరీర్ పుంజుకోవ‌డంతో మ‌నోడు వ‌రుస‌గా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడే త‌ప్పా పెళ్లి గురించి ఆలోచ‌నే చేస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. నితిన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు అమ్మాయిల‌తో ఉన్న రూమ‌ర్ల‌పై ఎలాంటి లీకులు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. అయితే తాజాగా నితిన్ న‌టించి లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌తో నితిన్ ప్రేమాయ‌ణంలో ఉన్నాడ‌ని, వీరిద్ద‌రి పెళ్లి అంటూ ఓ రూమ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌ర్వాత ఇదంతా పుకారే అని కూడా తేలిపోయింది.

ఇదిలా ఉంటే మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సుకు చేరువ‌వుతోన్న నితిన్ పెళ్లెప్పుడ‌వుతుంది బాబూ ? అని మీడియా వాళ్లు, ఇత‌ర మిత్రులు ప్ర‌శ్నిస్తున్నా మ‌నోడు మాత్రం ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇవ్వ‌కుండా స‌మాధానం దాట వేస్తూ వ‌స్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ టాక్ ప్ర‌కారం నితిన్ పెళ్లికొడుకు అయ్యాడు. ఇంకేముందు నితిన్ ఫ్యాన్స్ పిచ్చ ఖుషీ అవుతారు. అయితే ఇదంతా రియ‌ల్ లైఫ్‌లో కాదు.. రీల్ లైఫ్‌లో. 

త్రివిక్రమ్ సినిమాకు ముందు ఎన్టీఆర్ శతమానంభవతి దర్శకుడు సతీష్ వేగేశ్నతో ఓ సినిమా చేస్తాడని పుకార్లు వచ్చాయి. ఆ సినిమానే ఇప్పుడు నితిన్ హీరోగా చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద తెర‌కెక్కుతోన్న‌ ఈ సినిమాకు శ్రీనివాస కళ్యాణం అని పేరు పెట్టారు. 2018 మార్చిలో మొదలయ్యే ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తారు. ఎన్టీఆర్ చేయాల్సిన పాత్రను దక్కించుకున్న నితిన్ ఈ సినిమాలో పెళ్లి కొడుకు రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

ఇక నితిన్ రియ‌ల్ లైఫ్‌లో ఎలా ఉన్నా రీల్ లైఫ్‌లో మాత్రం పెళ్లికొడుకు ముచ్చ‌ట తీర్చేసుకుంటున్నాడు. టాలీవుడ్‌లో స్టైలీస్ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన నీర‌జ కోన ఇదే విష‌యాన్ని స‌ర‌దాగా చెపుతూ ట్వీట్ కూడా చేసింది. ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ పెళ్లెప్పుడు బాబూ అని అడుగుతార‌ని నితిన్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.