నితిన్ ‘ లై ‘ ప్రి రిలీజ్ టాక్‌.. ఎలా ఉందంటే…

అ…ఆ సినిమాతో రూ. 50 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్‌. అ…ఆ సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు త‌న అప్ క‌మింగ్ ప్రాజెక్టు లైతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ. 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాతో త‌న మార్కెట్ ప‌రిధిని మ‌రింత విస్తృతం చేసుకోనున్నాడు నితిన్‌.

ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. రూ. 40 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కినా ఈ సినిమాను ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నారు. అదే రోజు బోయ‌పాటి-బెల్లంకొండ‌ల జ‌య‌జాన‌కీ నాయ‌క‌, రానా-తేజ‌ల నేనే రాజు – నేనే మంత్రి సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు పోటీగా ఉన్నా అదే రోజు లైను రిలీజ్ చేస్తుండ‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు.

ఇక వాస్త‌వంగా చూస్తే ఈ సినిమా డైరెక్టర్ హనురాఘవపూడికి డిస్ట్రీబ్యూషన్ సెక్టార్‌లో నెగిటివ్ టాక్ ఉంది. అయితే ఆయ‌న సినిమాలు ఇష్ట‌ప‌డే ఓ వ‌ర్గం ప్రేక్ష‌కులు మాత్రం ఉన్నారు. అయితే ఇప్పుడు లై సినిమాకు ఏకంగా రూ. 40 కోట్ల బ‌డ్జెట్ పెట్ట‌డం అంద‌రికి షాకింగ్‌గా మారింది.

ఇక ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం లై కాస్త అటూ ఇటూగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఫ‌స్టాఫ్ చాలా సూప‌ర్ స్పీడ్ స్క్రీన్‌ప్లేతో బాగుంద‌ని, సెకండాఫ్ విష‌యంలో సినిమా తేడా కొట్టే అవ‌కాశం ఉంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు చెపుతున్నాయి. ఇక లై ఈ నెల 11నే వ‌స్తే కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుంద‌న్న సందేహాలు మార్కెట్ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.