‘నోటా’పై తెలుగు హీరో సంచలన వ్యాఖ్యలు!

October 10, 2018 at 10:43 am

టాలీవుడ్ లో అప్ కమింగ్ హీరో విజయ్ దేవరకొండ చేసింది మూడు సినిమాలే అయినా స్టార్ హీరో హోదా సంపాదించాడు. పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవిందం’సినిమా తో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు విజయ్ దేవరకొండ. ఒక రకంగా చెప్పాలంటే..అతి తక్కువ కాలంలో తెలుగుతెరపై సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. వరుసగా సక్సెస్ లు సాధిస్తున్న విజయ్ దేవరకొండ వెంట వెంటనే సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా రిలీజైన విజయ్ మూవీ ‘నోటా’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది..కానీ మనోడి ఇమేజ్ తో కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అయితే రివ్యూస్ పై ఈసారి విజయ్ దేవరకొండ చాలా సీరియస్ అయినట్లు సమాచారం.

‘నోటా’ను విమర్శకులను ఏకిపారేసే పనిపెట్టుకున్నాడు. దీనిపై విజయ్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఇదీ..పరిస్థితి. అంటూ ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. నా మీద ప్రేమతో సినిమా చూసేవారికి, పక్కవారు ఫెయిల్‌ అయితే ఆనందపడి సెలబ్రేట్‌ చేసుకునే వారికి’.. అంటూ మొదలుపెట్టి.. ‘నోటా’ ను చేసినందుకు గర్వపడుతా. దీని ఫెయిల్యూర్‌కు పూర్తిగా నాదే బాధ్యత. ఈ సినిమాపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అన్న విషయంపై నేను స్టడీ చేశాను..తప్పులు తెలుసుకున్నాను.. కానీ, నా యాటిట్యూడ్‌ మాత్రం మారదు.

ఓ విజయమో, అపజయమో ఓ రౌడీని తయారు చేయలేదు పడగొట్టలేదు. రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు.. విజయం కోసం పోరాడటం.. రౌడీలు అయినందుకు గర్వపడదాం. గెలిచే వరకు పోరాడుదాం..తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉంటుంది..లేదంటే ఫెయిల్యూర్స్ మనల్ని కుంగదీస్తాయి. ఇప్పుడే పండగ చేస్కోండి…వెంటనే తిరిగి వస్తా!.’ అంటూ పోస్ట్ చేసి మరోసారి తన మానరీజాన్ని ఎంటో అభిమానులకు ప్రత్యక్షంగా చూపించాడు విజయ్ దేవరకొండ. మరి దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

‘నోటా’పై తెలుగు హీరో సంచలన వ్యాఖ్యలు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share