సెట్లో.. క్రిష్ దిద్దిన ఎన్టీఆర్‌..!

November 10, 2018 at 12:01 pm

ఆంధ్రుల ఆత్మ‌గౌరవ ప్ర‌తీక ఎన్టీఆర్ జీవితాన్ని ట‌చ్ చేయ‌డమంటే.. అదొక సాహ‌స‌మే. సినీ, రాజ‌కీయ రంగాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసిన ఆయ‌న జీవితాన్ని తెర‌పై ఆవిష్క‌రించాలంటే గుండెల‌నిండా ద‌మ్ముండాలి. ఇందులో ఎలాంటి వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు తావులేకుండా.. తెలుగుజ‌నం మెచ్చుకునేలా బ‌యోపిక్ తీయాలంటే కనురెప్ప వాల్చొద్దు. ఇక ఏం కొంచెం తేడా వ‌చ్చినా ప్ర‌కంప‌న‌లు రేగ‌డం ఖాయ‌మే. ఇన్ని ఒత్తిళ్ల మ‌ధ్య ఒళ్లంతా క‌ళ్లు చేసుకుని ద‌ర్శ‌కుడు క్రిష్ విశ్వ‌విఖ్యాత న‌టుడు, రాజ‌కీయ దురంధ‌రుడు నంద‌మూరి తార‌క‌రామావు జీవిత విశేషాల‌తో బ‌యోపిక్‌ను రూపొందిస్తున్నారు. దీనిని రెండు భాగాలుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. శ‌నివారం క్రిష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం.45698915_1763233173804279_6607188851339296768_n

మొద‌టి భాగం ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాల‌తో కూడిన ఎన్టీఆర్‌- క‌థానాయ‌కుడు. రెండో భాగం రాజ‌కీయ అంశాల‌తో కూడిన ఎన్టీఆర్‌-మ‌హా నాయ‌కుడు. ఈ రెండు భాగాల‌ను ఏక‌కాలంలో చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఇందులో ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య‌బాబు, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్‌, సావిత్రి పాత్ర‌లో నిత్య‌మీన‌న్‌.. ఇంకా ఎంద‌రో ప్ర‌ముఖ న‌టులు ఇందులో భాగ‌స్వామ్యం అవుతున్నారు. వీరంద‌రినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను నిర్మిస్తున్నారు. నిజానికి.. ఇది అటు క్రిష్‌కు, ఇటు బాల‌క‌`ష్ణ‌కు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు. అందుకే ప్ర‌తీ చిన్న‌విష‌యంలో ఏమ‌ర‌పాటు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.45832659_1763233190470944_2497061765049745408_n

అయితే.. తాజాగా విడుద‌ల చేసిన ఈ సినిమా రెండు భాగాల‌కు సంబంధించిన సెట్లో సంద‌డి పోస్ట‌ర్లు స‌నిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ సినిమాపై క్రిష్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ సినీ జీవితంలో మ‌ర‌వ‌లేని సినిమా `గుండమ్మకథ`. ఇందులోని బుల్లోడు – బుల్లెమ్మ మధ్య నడిచిన సన్నివేశాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో గూడుక‌ట్టుకున్నాయి. `లేచింది మహిళా లోకం పాట ఎన్ని తరాలైనా త‌ర‌గ‌ని సంప‌ద‌. అయితే.. ఇక్క‌డ‌ గుండమ్మ కథ చెబుతూ ఆ పాట కోసం సావిత్రి పాత్ర‌లో నిత్యమేనన్ న‌టిస్తోంది. తాజాగా క్రిష్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌ సన్నివేశంలో భాగ‌మే. ఇక‌ క్రిష్‌ సన్నివేశం వివరిస్తుంటే బాలయ్య కూడా నిత్యకి సూచనలిస్తున్నారు.5555555555

అలాగే ఎన్టీఆర్ రాజ‌కీయ రంగంలో వేసిన ముద్ర‌ను రెండో భాగం మ‌హానాయ‌కుడ‌లో చూడొచ్చు. ఎన్టీఆర్‌ ప్రసంగాలు, వేదికపై ఆయన హావభావాలను అభిమానులు, తెలుగు ప్ర‌జ‌లు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక్కడ కూడా బాలయ్యతో ఓ వాడి వేడి రాజకీయ ప్రసంగం చేయించబోతున్నారు ద‌ర్శ‌కుడు క్రిష్‌. దీనికి సంబంధించిన లేటెస్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ‘నా తెలుగింటి ఆడపడుచులకు..’ అంటూ ఎన్టీఆర్‌ని గుర్తుకు తెచ్చే సన్నివేశంలో బాలయ్యని ఇలా నిమగ్నమ‌య్యారు. అయితే.. ఈ రెండు భాగాలు కూడా కొద్దిరోజుల తేడాలోనే సంక్రాంతి కానుక‌గా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై తెలుగుజ‌నంతోపాటు ట్రేడ్‌వ‌ర్గాలు ఎంతో ఆత‌`త‌గా ఎదురుచూస్తున్నారు.666666
ఇదిలా ఉండ‌గా.. సంక్రాంతి బ‌రిలో దాదాపుగా మూడు పెద్ద సినిమాలు బ‌రిలోకి దిగుతున్నాయి. ఇందులో మొద‌టి ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం ఎన్టీఆర్‌-క‌థానాయ‌కుడు. ఆ త‌ర్వాత రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీనుల ‘వినయ విధేయ రామ` సినిమా కూడా సంక్రాంతి కానుక‌గానే విడుద‌ల అవుతుంది. ఇది ప‌క్కా మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన సినిమా అని టీజ‌ర్‌తోనే తేలిసిపోయింది. అదేవిధంగా వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ రావిపూడి తీస్తోన్న ఎఫ్‌2 సినిమా. ఇది పూర్తిస్థాయి హాస్య‌ చిత్రం. ఈ మూడు సినిమాల్లో ఏది తెలుగు ప్రేక్ష‌కుల మెప్పు పొందుతుందో చూడాలి మ‌రి.

సెట్లో.. క్రిష్ దిద్దిన ఎన్టీఆర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share