ఎన్టీఆర్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!

December 14, 2018 at 5:32 pm

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య బాబు ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాల‌తో ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, రాజ‌కీయ జీవిత విశేషాల‌తో ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడును ఏక‌కాలంలో క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే అత్యంత ప్రాతిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టుపై రోజురోజుకూ అంచ‌నాలు పెరుగుతున్నాయి. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైర‌ల్ అవుతోంది.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా.. ట్రయిలర్, ఆడియో మాత్రం ఒక్క‌టేన‌ట‌. ఇందులో మొత్తం 11 పాట‌లు ఉన్నాయి. రెండు భాగాల‌కు క‌లిసి సింగిల్ అడియోగా విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఒక‌టే ట్రాయిల‌ర్ ఉంటుంద‌ట‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుకు సంబంధించిన పాట‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అంటే ఈనెల 16న విడుదల చేసే ట్రయిలర్ లోనే ఫిబ్రవరిలో విడుదల చేసే మహానాయకుడు కంటెంట్ కూడా ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది.

అలాగే ఈ అడియోలోనే రెండు భాగం పాట‌లు ఉంటాయ‌న్న‌మాట‌. మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడుతోనే పాట‌లు, ట్రాయిల‌ర్ ఉంటుంద‌న్న‌మాట‌. అయితే.. ఇక్క‌డో డౌట్ వ‌స్తోంది. అన్నీక‌లిసి ఒక‌టే చేస్తే.. మొద‌టి భాగానికి మాత్ర బ‌జ్ ఉంటుంద‌ని.. ఇక రెండో భాగానికి ప్ర‌మోష‌న్ వ‌ర్క్‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ ఉండ‌ద‌నే టాక్ ఇండ‌స్ట్రీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ద‌ర్శ‌కుడు క్రిష్‌, బాల‌క‌`ష్ణ అఫీషియ‌ల్‌గా చెబితేనేగానీ.. ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. చూద్దాం మ‌రి ఏం జ‌రుగుతుందో..

ఎన్టీఆర్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share