‘ఎన్టీఆర్’ బయోపిక్..వేటగాడు వచ్చేశాడు!

October 22, 2018 at 3:55 pm

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ కి సంబంధించి కొత్త కొత్త అప్ డేట్స్ బయటకు వస్తున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఆయన నట జీవితం గురించి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ గా తీస్తున్నారు. రెండో భాగం ఆయన రాజకీయ నేపథ్యానికి సంబంధించిన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా తీస్తున్నారు. DqGdqj4X4AAr776

ఈ రెండు భాగాలు జనవరి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఏఎన్ఆర్ గా సుమంత్, సీఎం చంద్రబాబు గా రానా, శ్రీదేవిగా రకూల్ ప్రీత్ సింగ్, బసవతారకం గా విద్యాబాలన్ ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యాయి. అప్పట్లో వేటగాడు సినిమా రికార్డులు సృష్టించింది. అలానే సినిమాలో ‘వేటగాడు’కి సంబంధించి మరికొన్ని సీన్లు కూడా చిత్రీకరించబోతున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ కారణంగానే ఈ బయోపిక్ లో వేటగాడు గెటప్ ని చూపించబోతున్నారు. ఇప్పటికే రకుల్, బాలయ్య కాంబినేషన్ లో ఆకుచాటు పిందె తడిసే పాటని చిత్రీకరించారు. తాజాగా ‘వేటగాడు’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ లో బాలయ్యని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం. అచ్చం తన తండ్రి ఎన్టీఆర్ రూపంలో కనిపిస్తున్న ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

‘ఎన్టీఆర్’ బయోపిక్..వేటగాడు వచ్చేశాడు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share