“ఎన్టీఆర్” క‌థానాయ‌కుడి “ఫస్ట్ డే” కలెక్షన్స్

January 10, 2019 at 3:24 pm

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందించిన విష‌యం తెలిసిందే. ఇందులో మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి షో నుంచే మాంచి టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వ‌సూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ‌లో మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు కూడా ట్రేడ్‌వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇదే స‌మ‌యంలో యూఎస్ఏలో కూడా మంచి ఓపెనింగ్స్‌ను రాబ‌ట్టుకుంది.49947654_2310230025875229_8727596338310545408_n

అయితే.. ఏపీలో, తెలంగాణ‌లో క‌లిపి ఎన్టీఆర్ క‌థ‌నాయ‌కుడు మొద‌టి రోజు 7.61కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సంక్రాంతి పండుగ సీజ‌న్ కావ‌డంతో ముందుముందు వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. మ‌రోవైపు మరో రెండు రోజుల వ్యవధిలో ‘వినయ విధేయ రామ , ఎఫ్ 2’ చిత్రాలు విడుదలకానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాల ప్ర‌భావం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌లెక్ష‌న్ల‌పై ఏ మేర‌కు ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ది.. వాటికి వ‌చ్చే టాక్ పైనే ఆధార‌ప‌డి ఉంటుంది.

ఈ రెండు సినిమాల‌కు ఏమాత్రం నెగెటివ్ టాక్ వ‌చ్చినా.. ఇక ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమాకు ఇక తిరుగే ఉండ‌ద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక పాజిటివ్ టాక్ రావ‌డంతో ఈ సినిమా యూనిట్ కూడా ఆనందంగా ఉంది. ఇదిలా ఉండ‌గా.. ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశంతో మొద‌లు కానున్న రెండో భాగం ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కోసం అప్పుడే జ‌నంలో ఎదురుచూపులు మొద‌ల‌య్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.

ఏరియా కలక్షన్స్
నైజాం 1.72 కోట్లు
సీడెడ్ 80లక్షలు
నెల్లూరు 52లక్షలు
గుంటూరు 2.04 కోట్లు
కృష్ణా 74,30,211
పశ్చిమ గోదావరి 68లక్షలు
తూర్పు గోదావరి 41,06,116
ఉత్తరాంధ్ర 69,78,554

ఏపీ, తెలంగాణ మొదటి రోజు షేర్ 7. 61 కోట్లు

“ఎన్టీఆర్” క‌థానాయ‌కుడి “ఫస్ట్ డే” కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share