ఎన్టీఆర్ బయోపిక్: మా వల్ల కాదు

October 15, 2018 at 12:02 pm
8888888888888

విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నంద‌మూరి బాల‌క‌`ష్ణకు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కం. మొద‌ట ఈ ప్రాజెక్టు నుంచి ద‌ర్శ‌కుడు తేజ త‌ప్పుకుని క్రిష్ వ‌చ్చాక దాని రూపురేఖ‌లే మారిపోయాయి. ఒక్క‌సారిగా ఈ సినిమాపై భారీగా అంచ‌నాలు పెరిగాయి. అందుకుత‌గ్గ‌ట్టే.. క్రిష్ కూడా ఈ సినిమాపై ఎప్పుడూ హైప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని, స్టిల్స్‌ను బ‌య‌ట‌కు వ‌దుల్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి.. అటు సినిమా రంగంలో, ఇటు రాజ‌కీయ రంగంలో చెర‌గ‌ని ముద్ర‌వేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు పండుగే మ‌రి.bxoshfqvxl-1538650598

ఈ నేప‌థ్యంలోనే ట్రేడ్ స‌ర్కిళ్ల‌లో కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై మాంచి క్రేజీ ఏర్ప‌డింది. ఈ సినిమాను తీసుకునేందుకు బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఓ ప్ర‌క‌ట‌న‌తో అంతా తారుమారు అయింద‌నే టాక్ వినిపిస్తోంది. అదేమిటో చూద్దాం.. ఎన్టీఆర్ జీవితాన్ని మొత్తం ఒక భాగంలో చూపించ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన క్రిష్ బ‌యోపిక్‌ను రెండు భాగాలు తీసుకొస్తామ‌ని ఆయ‌న ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అదికూడా కేవ‌లం ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ రెండు భాగాల‌ను విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఇది ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ సినిమా నిర్మాత‌లు ఈ రెండు భాగాల‌కు ఒక‌టే ధ‌ర‌ను నిర్ణ‌యించడంతో బ‌య్య‌ర్లు కొంత నిరుత్సాహానికి గుర‌వుతున్నారు. ఈ సినిమాను తీసుకోవ‌డానికి ముందుకు వ‌చ్చేందుకు సుముఖంగా లేర‌నే టాక్ వినిపిస్తోంది.Balakrishna-NTR-Biopic-First-Look-Poster-Out

నిజానికి.. ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగంలోనే మాంచి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక రెండో భాగంలో అంతా రాజ‌కీయ చుట్టూ తిరుగుతుంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ఈ నేప‌థ్యంలో మొద‌టి భాగంపై ఉన్న క్రేజీ రెండో భాగంపై ఉండ‌క‌పోవ‌చ్చున‌నీ.. అది కూడా ప‌క్షం రోజుల వ్య‌వ‌ధిలోనే రెండు భాగాలు విడుద‌ల కావ‌డం వ‌ల్ల బ‌య్య‌ర్లు లాస్ అవుతార‌ని ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ అన‌డం గ‌మ‌నార్హం. రెండు భాగాల‌కు కూడా ఒక‌టే ధ‌ర నిర్ణ‌యించ‌డం స‌రికాద‌ని ఆ డిస్ట్రిబ్యూట‌ర్ చెప్పుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండుభాగాల ఫార్ములాతో దెబ్బేన‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ముందుముందు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

ఎన్టీఆర్ బయోపిక్: మా వల్ల కాదు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share