ఎన్టీఆర్‌లో మ‌రో స్టార్ హీరో..?

November 15, 2018 at 11:02 am

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు సంబంధించి రోజుకో కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. ఇది సినిమాపై మ‌రింత పెంచుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన అంశాలు విప‌రీత‌మైన హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా.. మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టులో ప్ర‌ముఖ న‌టులు భాగ‌స్వామ్యం అవుతున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌క‌`ష్ణ‌, బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్, సావిత్రి పాత్ర‌లో నిత్య‌మీన‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.ntr-biopic_201810141271

అయితే.. ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొద‌టి భాగం ఎన్టీఆర్-క‌థానాయ‌కుడులో ఆయ‌న సినీరంగ విశేషాలు ఉంటాయి. ఇక రెండో భాగం ఎన్టీఆర్-మ‌హానాయకుడులో ఆయ‌న రాజ‌కీయ అంశాలు ఉంటాయి. అయితే..ఈ రెండో భాగంలో తెలుగుదేశం పార్టీని స్థాపించింది మొద‌లు అధికారంలోకి రావ‌డం.. ఇత‌ర అంశాలు ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌తో ఎంద‌రో ప్ర‌ముఖుల‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే.. దీనికి సంబంధించిన ఓ అతిథి పాత్ర‌లో మ‌రో స్టార్ హీరో న‌టించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.ycnbcnlisw-1536899426

ఏమిటా అతిథి పాత్ర‌, ఎవ‌రా స్టార్ హీరో అంటే మాత్రం ఇప్ప‌టికిప్పుడు క్లారిటీగా చెప్ప‌డం క‌ష్ట‌మేగానీ.. ఇందుకు సంబంధించిన ఆలోచ‌న మాత్రం ప‌క్కాగా ఉన్న‌ట్లు ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. ఇక అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే మాత్రం అభిమానులకు పండుగేన‌ని చెప్పొచ్చు. మ‌రోవైపు ఆ స్టార్ సానుకూలంగా లేకుంటే.. ఏకంగా నందమూరి కుటుంబం నుంచి మరో నటవారసుడిని తెరంగేట్రం చేయించాలని కూడా చిత్ర‌యూనిట్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కాగా, ఎన్టీఆర్ -క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుండ‌గా.. ఎన్టీఆర్‌- మ‌హానాయ‌కుడు విడుద‌ల విష‌యంలో మాత్రం కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది.

ఎన్టీఆర్‌లో మ‌రో స్టార్ హీరో..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share