‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్‌

September 19, 2017 at 5:50 am
Jai Lava Kusa, NTR, Politics

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది కేవ‌లం సినిమాల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌దు. ఎన్టీఆర్ డైలాగుల‌పై కేవ‌లం సినిమా రంగంలోనే కాకుండా రాజ‌కీయ కోణంలో కూడా చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగుల‌పై కూడా రాజ‌కీయ కోణంలో చాలా సార్లు చ‌ర్చ‌ల‌కు వ‌స్తుంటాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను శాసించిన బ‌ల‌మైన నంద‌మూరి ఫ్యామిలీ నుంచి రావ‌డంతో స‌హ‌జంగానే ఆయ‌న్ను సినిమా కోణంలోనే కాకుండా రాజ‌కీయ కోణంలో కూడా చూస్తుంటాం.

ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వకుశ‌. ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా పాలిటిక్స్‌పై పంచ్ డైలాగులు ఉంటాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫ్యూచ‌ర్‌లో రాజకీయాల వైపు అడుగులేసే అవకాశమున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ఓ రాజ‌కీయ పార్టీకి అధ్య‌క్షుడిగా క‌నిపించ‌డంతో పాటు అదిరిపోయేలా పొలిటిక‌ల్ సెటైర్లు వేస్తాడ‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గ‌తంలో టీడీపీ గెలుపుకోసం ఎన్టీఆర్ ప్ర‌చారం చేయ‌డం, ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, బాల‌య్య‌కు దూరంగా ఉండ‌డంతో స‌హ‌జంగానే ఈ పుకార్లు రాజ‌కీయంగా హీట్ పుట్టించాయి. ఈ వార్త‌ల‌పై ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఎన్టీఆర్ స్పందించాడు. జై లవకుశలో ప్రత్యేకంగా రాజకీయాల ప్రస్తావన ఏమీ ఉండదన్నాడు. దాని మీద ఫోకస్ ఏమీ లేదన్నాడు. ఇక జై జీవితంలో రాజకీయాలు ఒక భాగంగా ఉంటాయని.. అది పాత్ర కోసం పెట్టిన సెటప్ తప్ప.. దాన్ని కావాలని ఇరికించలేదని.. సినిమాలో పొలిటికల్ పంచులు ఉండవని చెప్పాడు. అది అస‌లు సంగ‌తి.

 

‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share